సినీ నటిగా, జబర్దస్త్ టీవీ షో న్యాయ నిర్ణేతగా, నగరి ఎమ్మెల్యేగా రోజా నిత్యం బిజీ బిజీగా గడుపుతూ ఉంటారు. అయితే.. ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆమెకు కాస్త విశ్రాంతి లభించింది. దీంతో.. కుటుంబ సభ్యులతో ఆమె సరదాగా గడిపేస్తున్నారు.

అంతేకాదు.. వంటలక్క లాగా మారి.. లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్నవారికి తన చేతితోనే స్వయంగా వంట చేసి వడ్డించారు. ప్రతి రోజూ దాదాపు 500ల మందికి ఆమె భోజనం పెట్టారు. దీంతో.. ఆమె చేసిన మంచి పనికి మరింత మంది అభిమానులు పెరిగిపోయారు.

 

తాజాగా.. ఆమె వ్యాయామంపై దృష్టిపెట్టారు. ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ.. ఫిట్ నెస్ ఛాలెంజ్‌ను విసిరారు రోజా. డంబెల్స్‌తో చాలా ఈజీగా వర్కౌట్ చేస్తూ.. చెమటలు చిందిస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటినా తనలోని గ్లామర్ చెక్కుచెదరకుండా కాపాడుకుంటున్న రోజా ఫిట్ నెస్ మంత్రం జపిస్తూ.. వన్ మినిట్ ప్లాంక్ ఛాలెంజ్ విసిరారు. 

మోచేతులపై శరీరాన్ని మొత్తం ఆల్చి ఒక్క నిమిషం పాటు అలాగే ఉన్న రోజా.. వన్ మినిట్ ప్లాంక్ ఛాలెంజ్ నేను చేశా మరి మీరు అంటూ వీడియో వదలింది. కాగా.. ఆమె కసరత్తులు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రోజా ఇప్పటికీ ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు అంటే... ఆమె ఇలాంటి ఫిట్నెస్ ని ఫాలో కావడమే కారణం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.