తెలుగు దేశం పార్టీ  అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సంక్రాంతి పండగ సందర్భంగా భోగి మంటలు వేసుకుంటున్నారని.. కానీ చంద్రబాబు మాత్రం తన కడుపులో మంటలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబు బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని రోజా అన్నారు. రైతులకు వ్యతిరేకంగా జీవోలు వచ్చాయని, వాటిని తగలబెట్టి నిరసన తెలపాలని చెప్పడం చూస్తుంటే ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందన్నారు. రైతే రాజన్న విధంగా రైతు అడిగినవి, అడగనవి కూడా చేసి రైతుకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.