ఎమ్మెల్యేపై దాడి.... సొంత పార్టీ కార్యకర్తలపై రోజా ఫిర్యాదు

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

MLA Roja Complaint Against YCP Supporters

ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా...తమ పార్టీ కార్యకర్తలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇటీవల ఎమ్మెల్యే రోజా పై దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై రోజా చాలా సీరియస్ గా ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపైనే పుత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, హరీష్, సంపత్,  అంబు, సరళ, రామ్మూర్తి తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పుత్తూరు పోలీసులు.

AlsoReadఇప్పుడు గుర్తొచ్చామా, నగరిలోకి రావొద్దు: రోజాకు చేదు అనుభవం...

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును నిలిపిన వైసీపీ కార్యకర్తలు.. రోజా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినలేదు. అంతేకాకుండా పెద్ద ఎత్తున రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.

Also Read: మీ జాతకం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా!

 

కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళలనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా తమ పార్టీకి చెందిన అమ్ములు వర్గమే దాడి చేయించిందని ఆరోపించిన రోజా.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు రోజా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అమ్ములు వర్గం ఆరోపణలు చేస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios