Asianet News TeluguAsianet News Telugu

టిడిపికి రేవంత్ రాజీనామా

  • అనుకున్నట్లే తెలుగుదేశంపార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేసారు.
  • శనివారం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేందుకు రేవంత్ తో పాటు పలువురు తెలంగాణా నేతలు కూడా విజయవాడకు చేరుకున్నారు.
  • రేవంత్ ను పార్టీలో నుండి సాగనంపటమే ఏకైక లక్ష్యంగా టిటిడిపి నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు.
Mla revanth reddy quits tdp

అనుకున్నట్లే తెలుగుదేశంపార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేసారు. శనివారం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేందుకు రేవంత్ తో పాటు పలువురు తెలంగాణా నేతలు కూడా విజయవాడకు చేరుకున్నారు. రేవంత్ ను పార్టీలో నుండి సాగనంపటమే ఏకైక లక్ష్యంగా టిటిడిపి నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. ఉదయం గంటపాటు అందరితోనూ తర్వాత విడివిడిగాను చంద్రబాబు భేటీ అయ్యారు.

మళ్ళీ మధ్యాహ్నం తర్వాత నేతలతో చంద్రబాబు భేటీ అవ్వాల్సి ఉంది. భోజన విరామం తర్వాత సమావేశమవుదామని కూడా అనుకున్నారు. కానీ హటాత్తుగా రేవంత్ తన రాజీనామాను చంద్రబాబుకు సమర్పించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా స్తున్నట్లు లేఖలో రేవంత్ స్పష్టంగా చెప్పారు.

పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. భోజన విరామం కోసం బయటకు వచ్చిన రేవంత్ తో పాటు మాజీ ఎంఎల్ఏ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరూ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గను దర్శించుకున్నారు.

తెలంగాణా టిడిపిలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించనట్లు రేవంత్, చంద్రబాబుతో ప్రస్తావించినట్లు సమాచారం. అందుకే తాను పార్టీని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారట. ‘పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా మీరంటే (చంద్రబాబు)అంచంచల అభిమానం, గౌరవం ఉన్నట్లు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా, రేవంత్ రాజీనామా లేఖ తనకు అందలేదని చంద్రబాబు ప్రకటించారు. రేవంత్ రాజీనామా చేసిన సమయంలో చంద్రబాబు మీడియా సమావేశంలోనే ఉన్నారు. అందుకే విషయం తెలీగానే మీడియా వాళ్ళు రేవంత్ రాజీనామా ప్రస్తావనను చంద్రబాబు వద్ద లేవనెత్తారు.

‘భోజన విరామం తర్వాత కలుద్దామని తాను రేవంత్ తదితరులతో చెప్పి మీడియా సమావేశానికి వచ్చానని, తాను వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తనకు తెలీద’ని చంద్రబాబు చెప్పారు.  పార్టీ వర్గాలేమో తన రాజీనామా లేఖను రేవంత్, చంద్రబాబుకే అందచేసారని చెబుతుండగా, చంద్రబాబేమో తనకు రాజీనామా లేఖ అందలేదని చెప్పటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios