నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన దాతృత్వాన్ని ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం బోరుబావిలో పడి మృతి చెందిన మోక్షిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మోక్షిత కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి. 

బోరుబావిలో చిన్నారులు పడినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆ చిన్నారులను బయటకు తీసే వరకు అక్కడే ఉన్నారు. మోక్షితను ఆస్పత్రికి తీసుకెళ్లడం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. 

అయితే దురదృష్టవశాత్తు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మోక్షిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. బోరుబావిలో పడి మృతి చెందిన మోక్షిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మోక్షిత అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మోక్షిత తల్లిదండ్రులకు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనకు చెందిన సొంత డబ్బులులక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. అలాగే చిన్నారులను బయటకు తీసేందుకు శ్రమించిన పెద్దపల్లి గ్రామ యువకులు చిరంజీవి, వరప్రసాద్ లకు రూ.50వేలు బహుమతిని కూడా అందజేశారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.