ఎనిమిది గంటల జలదీక్ష: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు. వంతెన నిర్మాణం కోసం జలదీక్ష చేపట్టనున్నట్టుగా పోలీసులు ప్రకటించారు.
నెల్లూరు: వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గురువారంనాడు హౌస్ అరెస్ట్ చేశారు. తన నియోజకవర్గంలోని పొట్టిపాలెం కలుజు వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎనిమిది గంటల పాటు జలదీక్షను చేయనున్నట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ దీక్షకు వెళ్లకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
తన నివాసం నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీధర్ రెడ్డి నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు.
దీంతో తన నివాసం ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బైఠాయించి నిరసనకు దిగారు. వంతెన నిర్మాణం కోసం తాను నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. పోలీసులు అడ్డుకున్నా సరే తాను దీక్షను కొనసాగిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.