జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి నిప్పులు చెరిగారు. తాను కన్నెర్రజేస్తే పవన్‌ కళ్యాణ్ దెందులూరులో సమావేశం పెట్టేవాడా అని ప్రశ్నించారు. 

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి నిప్పులు చెరిగారు. తాను కన్నెర్రజేస్తే పవన్‌ కళ్యాణ్ దెందులూరులో సమావేశం పెట్టేవాడా అని ప్రశ్నించారు. 

తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నందుకే సంయమనంతో ఉన్నానని స్పష్టం చేశారు. దెందులూరు నుంచి పోటీ చేయమంటే ఎవరినో పోటీకి నింపుతానంటున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ దెందులూరులో పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు.

నా రౌడీయిజం పేదవాడి సమస్యల పరిష్కారంలో ఉంటుందని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టి.,కులపిచ్చి తీసుకురావాలని పవన్ చూస్తున్నారని చింతమనేని ఆరోపించారు. మరోవైపు పవన్‌, జగన్‌లతో బీజేపీ తోలుబొమ్మలాట ఆడిస్తోందని చింతమనేని విమర్శించారు. పవన్ కళ్యాణ్, జగన్ లు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.