దంపతులను ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు...భార్య మృతి, భర్తకు సీరియస్

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 29, Aug 2018, 7:18 PM IST
mla car hit scooty..wife dead..husband serious
Highlights

 కృష్ణా జిల్లాలో ఓఎమ్మెల్యే వాహనం ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాజీ ఎంపీ సినీనటుడు నందమూరి మరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు హైదరాబాద్ బయలు దేరారు. అందులో భాగంగా  గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా కేసరపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. 

విజయవాడ: కృష్ణా జిల్లాలో ఓఎమ్మెల్యే వాహనం ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాజీ ఎంపీ సినీనటుడు నందమూరి మరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు హైదరాబాద్ బయలు దేరారు. అందులో భాగంగా  గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా కేసరపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. 


ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య మృతి చెందగా...భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే రామారావు వాహనం స్కూటీని ఢీకొట్టి డివైడర్  ఎక్కి స్థంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఎమ్మెల్యేకు పెనుప్రమాదం తప్పినట్లైంది.  

loader