వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ధర్నాకు దిగారు. శనివారం ఆళ్ల.. తాడేపల్లి  పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఆయనకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు కూడా వేల సంఖ్యలో  ఈ ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ నేతలే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని.. రివర్స్ లో తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.

చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే వైఎసీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన టీడీపీ నాయకులు మీద పోలీసులు ఎలాంటి కేసులు పెట్టలేదని అన్నారు. దెబ్బలు తిన్న వైఎసీపీ కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

తమ కార్యకర్తల మీద దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై మీద కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు, లోకేష్ మాటలు విని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.