ఏపీ అసెంబ్లీలో స్పీకర్ సీటుకి అవమానం జరిగింది. స్పీకర్ కూర్చోవాల్సిన సీటులో.. ఎమ్మెల్యే కూర్చోవడం గమనార్హం. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... శుక్రవారం విభజన హామీల అమలుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

కాగా..  చర్చ జరుగుతున్న సమయంలో 13 నిమిషాల పాటు స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు రెస్ట్‌ రూములోకి వెళ్ళారు. ఆ సమయంలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య స్పీకర్‌ స్థానాన్ని అధిష్టించి సభను నడిపించారు. ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్లచొక్కా, నల్ల ప్యాంటు వేసుకొని శాసనసభకు వచ్చారు. పూర్తిగా నల్ల దుస్తులతో స్పీకర్‌ స్థానంలో కూర్చోవడం వివాదానికి దారి తీసింది.