చిత్తూరు: వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతి పావని సంఘటన విషాదాంతమైంది. ఓ వ్యవసాయ బావిలో ఆమె శవమై కనిపించింది. మంగళవారం బావిలో ఆమె మృతదేహాన్ని కనిపెట్టారు. 

చిత్తూరు జిల్లా రామకుప్పం మండంల మునింద్రంకు చెందిన పావని వారం రోజుల క్రితం కనిపించకుండా పోయింది. చివరకు బావిలో శవమై తేలింది. పాపని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మిత్రుడు మునిరత్నమే పావనిని హత్య చేశాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు ఇంటిపై దాడి చేశారు. అయితే, వారు దాడి చేసిన సమయంలో అతను పరారీలో ఉన్నాడు. చివరకు మునిరత్నం ముణేంద్రం ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని మరణించాడు.