Asianet News TeluguAsianet News Telugu

మిస్ట్ కాల్ ఎఫెక్ట్: రూ.5లక్షలు హాంఫట్

వారం రోజుల్లో రూ.5లక్షలు తిరిగి చెల్లిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో ఆందోళనపడిన నాగరాజు రాయదుర్గం వెళ్లాడు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చెయ్యాలంటూ పోలీసుల వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

missed call person cheating 5lakhs from nagaraju
Author
Ananthapuram, First Published May 1, 2019, 4:26 PM IST

అనంతపురం: అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త. అప్రమత్తంగా ఉండండి అంటూ జరుగుతున్న ప్రచారం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ ఏదోఒక మూల ఎవరో ఒకరు అపరిచిత వ్యక్తల బారినపడి మోసపోతూనే ఉంటున్నారు. 

తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ లాబ్ టెక్నీషియన్ ఇలాగే మోసోయాడు. వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్సరే ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్న నాగరాజుకు నెల రోజుల క్రితం మిస్డ్‌ కాల్‌ వచ్చింది. ఎవరో అనుకుని నాగరాజు తిరిగి కాల్ చేశాడు. 

తన పేరు రమేష్ అని పరిచయం చేసుకున్నాడు. డైలీ ఫోన్లో మాట్లాడుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే పదిహేనురోజుల క్రితం రమేష్ నాగరాజుకు ఫోన్ చేసి తన అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు కావాలంటూ బ్రతిమిలాడాడు. 

స్నేహితుడే కదా ఇచ్చేస్తాడులే అని నమ్మిన నాగరాజు ఇతరుల దగ్గర అప్పుజేసి మరీ రూ.5లక్షలు రమేష్ కు ఇచ్చాడు. వారం రోజుల తర్వాత రమేష్ సెల్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో నాగరాజు కంగారుపడ్డాడు. 

వారం రోజుల్లో రూ.5లక్షలు తిరిగి చెల్లిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో ఆందోళనపడిన నాగరాజు రాయదుర్గం వెళ్లాడు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చెయ్యాలంటూ పోలీసుల వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios