Asianet News TeluguAsianet News Telugu

‘మా ఇంటికి రా… స్నానం చేయిస్తా! ఓ కిస్ ఇస్తావా.. !’...పంచాయతీ మహిళా కార్యదర్శితో ఎంపీడీవో అసభ్య ప్రవర్తన..

ఓ ఎంపీడీవో తన దగ్గర పనిచేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెతో కామప్రేలాపనలు చేస్తూ లైంగిక హింసకు గురిచేశాడు. దీంతో అతనికి ఆమె బంధువులు, గ్రామస్తులు దేహశుద్ది చేశారు. 

Misbehavior of MPDO with panchayat woman secretary in nellore
Author
First Published Sep 9, 2022, 9:39 AM IST

నెల్లూరు : ‘ మా ఇంటికి రా… స్నానం చేయిస్తా! ఓ కిస్ ఇస్తావా.. ! పోనీ ఎక్కడికి రమ్మంటావు..!’  పంచాయతీ మహిళా కార్యదర్శితో ఓ ఎంపీడీవో కామప్రేలాపనలు ఇవి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు  చెందిన ఓ మహిళా కార్యదర్శిని ఎంపీడీవో పఠాన్ ఖాన్ చాలాకాలంగా లైంగికంగా వేధిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. వేధింపులపై పఠాన్ ఖాన్ ను నిలదీశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీడీవో తెలపడంతో, గ్రామస్తులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ  మహిళ  ఎంపీడీవో షర్ట్ పట్టుకుని… రారా బయటకు అంటూ లాగింది. 

అతని మీద చేయి చేసుకుంది. ఎంపీడీఓ కూడా తిరగబడి, చేయి చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులంతా ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఎంపీడీఓను కాపాడటానికి ప్రయత్నించిన సిబ్బందికీ దెబ్బలు తప్పలేదు. ఇందుకూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కేసు నమోదు చేశారు. ఎంపీడీఓ వేధింపులును తట్టుకోలేక కార్యదర్శి ఆత్మహత్యకు ప్రయత్నించిందని, ఫోన్ లో అతడు పెట్టే మెసేజ్ లు, వాయిస్ రికార్డులు చూసి ఆ అమ్మాయి సంసారం కూలిపోయే ప్రమాదం వచ్చిందని కార్యదర్శి బంధువులు తెలిపారు. 

ముఖంపై సాంబారు పోసి , ఆపై గొంతు పిసికి : నంద్యాల అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్‌పై హత్యాయత్నం

ఎంపీడీఓను సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. జడ్జీ సీఈఓ, డీపీఓ, నెల్లూరు ఆర్డీఓ, ఐసీడీఎస్ పీడీలతో ఇద్దరు ఎన్జీవోలతో కమిటీ వేశారు. ఈ కమిటీ శుక్రవారం ఇందుకూరుపేటకు వెళ్లి విచారణ చేపడతారు. వీరి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. 

ఇదిలా ఉండగా, అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి ఎం సోమశేఖర్ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. చీరాలకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చెప్పుల దుకాణం నిర్వహించేది. ఆమె కుమార్తెను చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్ కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం జాన్ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలో జాన్.. భార్య తల్లికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకు ఒకరోజు చీరాలకు వచ్చి  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోయాడు. దీంతో ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చింది. ఆ తర్వాత భర్తతో కలిసి చీరాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే సీఐ వి.సూర్యనారాయణ దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం నిరూపణ అయినట్లుగా న్యాయమూర్తి పేర్కొంటూ నిందితుడు జాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో  మరో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యత్తవు కొండారెడ్డి వాదించగా,  కోర్టు  లయన్ ఆఫీసర్గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios