రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన రాజమండ్రిలో విచిత్ర వివాహం జరిగింది. ఇద్దరు మైనర్లు రాజమండ్రి జూనియర్ కళాశాలలో వివాహం చేసుకున్నారు. ప్రేయసి మెడలో ప్రియుడు తాళి కట్టాడు. దీంతో బిత్తరపోవడం వారి కుటుంబ సభ్యుల వంతైంది. బెంచీలను పెళ్లి పీటలుగా మార్చి ఇద్దరు వివాహం చేసుకున్నారు.

ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మొదటి సంవత్సరం ప్రారంభం నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. మైనారిటీ తీరిన తర్వాత తమ కూతురికి వివాహం చేయడానికి బాలిక తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. 

ఇద్దరికి కూడా టీసీ ఇచ్చి కళాశాల యాజమాన్యం పంపించేసింది. తమ ఇంటికి రావద్దని బాలిక తల్లిదండ్రులు తమ కూతురికి చెప్పారు. ఈ క్రమంలో బాలిక తాను పెళ్లి చేసుకున్న బాలుడితో వెళ్లడానికి సిద్ధపడినట్లు తెులస్తోంది. వారి వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.