విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బొమ్మలు కొనిస్తానని చెప్పి బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఓడిగట్టాడు.

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బొమ్మలు కొనిస్తానని చెప్పి బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఓడిగట్టాడు. ఈ ఘటన అనంతరం బాలిక తల్లి వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి స్థానికులతో కలిసి నిందితుడు హఫీజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన అనంతరం బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఇక, ఈ కేసులో నిందితుడిగా ఉన్న హఫీజ్ స్వస్థలం ముంబై కాగా.. అతడు విజయవాడలో బాధిత బాలిక ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా క్రితం హఫీజ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచే హఫీజ్ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఆదివారం బాలికకు బొమ్మలు కొనిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.