Asianet News TeluguAsianet News Telugu

చాక్లెట్ల ఆశ చూపి.. మైనర్ బాలికలపై లైంగిక దాడి.. గట్టిగా అరవడంతో...

ఇద్దరు  మైనర్  బాలికలకు చాక్లెట్లు ఆశగా చూపి మంచిచేసుకుని, వారిని ఊరుబయటకు తీసుకువెళ్లి రత్తయ్య (60), బాబు (48) అనే వ్యక్తులు గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

Minor girls 'raped' in Andhrapradesh
Author
Hyderabad, First Published Oct 14, 2021, 2:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కామాంధులు అన్నెం పున్నెం తెలియని చిన్నారుల మీద కన్నేశారు. వారిని ఒక్కసారి కాదు... తరచుగా sexual assault చేస్తూ నరకం చూపించారు. చివరికి తల్లిదండ్రులు గుర్తించడంతో ఆ కామాంధులకు శిక్ష పడింది. 

ఇద్దరు  మైనర్  బాలికలకు చాక్లెట్లు ఆశగా చూపి మంచిచేసుకుని, వారిని ఊరుబయటకు తీసుకువెళ్లి రత్తయ్య (60), బాబు (48) అనే వ్యక్తులు గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. మంగళవారం బాలికల అరుపులు వినపడంతో విషయాన్ని గమనించిన తల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, వారం క్రితం ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. అమ్మాయిల మీద అత్యాచారాలు కొత్త రూపు తీసుకుంటున్నాయి. వయసు తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడడం ఎప్పటినుంచో ఉన్నదే.. అయితే ఇటీవలి కాలంలో చిన్నారుల మీద అత్యాచారాల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో తోబుట్టువులు, తండ్రి, బాబాయిలాంటి వారితో సహా ప్రతీ ఒక్కరు చిన్నారులను చిదిమేయాలనే చూస్తున్నారు. తాజాగా ఓ handicapped వ్యక్తి, మైనర్ బాలుడు చిన్నారులను చిదిమేయడం.. అత్యంత భయాందోళనలు కలిగించే విషయం. 

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక కేసులో నిందితుడు దివ్యాంగుడు కాగా మరో కేసులో ఈ దారుణానికి పాల్పడింది పదిహేనేళ్ల బాలుడు కావడం భయాందోళనలు కలిగించే విషయం. 

నిజామాబాద్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. ఓ కానీలో కూలీ పనులు చేసుకుని బతికే కుటుంబాలు నివసిస్తున్నాయి. పెద్దలు, పిల్లలను ఇంట్లో వదిలి పనులకు వెడుతుంటారు. ఆదివారం కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులమీద (8యేళ్లు,12 యేళ్లు) స్థానికుడైన వసీం(33) కన్నేశాడు.

అమానుషం : చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి.. అత్యాచారం..!

వారికి chocolates ఆశ చూపించాడు. ఆ చిన్నారులు ఆశగా అతని దగ్గరికి వచ్చారు. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి.. అక్కడ molestation చేశాడు. బుధవారం ఓ minor girlకి కడుపునొప్పి రావడంతో కుటుంబీకులకు చెప్పింది. వారు కడుపునొప్పికి కారణాలేంటని ప్రశ్నించే క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

వారు వెంటనే గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు వసీంను రిమాండుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. పోలియో బాధితుడైన అతను మేస్త్రీగా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఓ పాప ఉన్నారు. మరో ఘటనలో ఎల్లారెడ్డి డివిజనలో ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిమీద అదే కాలనీకి చెందిన పదిహేనేళ్ల బాలుడు గురువారం చాక్లెట్ల ఆశ చూపి.. ఇంటి వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 

ఇంట్లో నిద్రపోతున్న తల్లి బాలిక కేకలు విని వచ్చి చూసేసరికి boy పారిపోతూ కనిపించాడు. బాధితులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాలుడి గురించి పోలీసులు వెతుకుతున్నారు. బాలుడి మీద కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios