ప్రకాశం: కన్న కూతిరిని కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాసుల కోసం దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని బాలికపై గుప్తనిధుల పూజల పేరుతో ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడినా ఆ కసాయి తండ్రి పట్టించుకోలేదు. ఇలా కాపాడాల్సిన వాడే కనికరం లేకుండా వ్యవహరించడంతో ఆ బాధపడటం  తప్పఆ చిన్నారి ఏం చేయలేకపోయింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన  బూసి రాంబాబు అలియాస్ విష్ణువర్థన్ రెడ్డి వివిధ కేసుల్లో నిందితుడు. తెలంగాణలోనే  కాకుండా పక్కరాష్ట్రం ఏపిలో కూడా అతడు పలు నేరాలకు పాల్పడ్డారు. ఇలా పలుమార్లు జైలుకు వెళ్లివచ్చిన ఇతడు ప్రస్తుతం బెయిల్ పై బయట వున్నాడు. 

అయితే అతడు ఈసారి నేరాలకు పాల్పడటం కాకుండా మరింత ఈజీగా మనీ సంపాదించాలని ఓ  ప్లాన్ వేశాడు. ఇందులోభాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్రానికి చేరుకుని తనకు తాను స్వామీజీగా పరిచయం చేసుకున్నాడు. కొంతకాలం  ప్రజలతో కలిసిపోయి వివిధ రకాల పూజల పేరుతో స్వామీజిగా నమ్మించాడు. ఇలా క్రిమినల్ కాస్త జగద్గురు విష్ణువర్థన్ బాబా గా మారిపోయాడు. 

read more   ఫోన్ లో వలపు వల.. నగ్న ఫోటోలు, కోరిక తీర్చాలంటూ...

ఈ క్రమంలోనే గ్రామంలోని గోన బాలరాజు అనే వ్యక్తికి గుప్తనిధులపై ఆశ వున్నట్లు ఈ దొంగ స్వామి తెలుసుకున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకుని అతడి ఇంట్లో లంకెబిందెలు వున్నట్లు నమ్మించి... పూజలు చేసి బయటకు తీస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో పలుమార్లు బాలరాజు ఇంటికి వెళ్లిన ఈ దొంగ బాబా అతడి 13ఏళ్ల మైనర్ కూతురిపై కన్నేశాడు. ఆమె చేత పూజలు చేయిస్తానని తండ్రికి నమ్మించి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తండ్రికి తెలిసినా పట్టించుకోలేదు.

అయితే బాలిక తల్లి కూతురిపై జరిగినా అఘాయిత్యం గురించి తెలుసుకుని వెంటనే  దొనకొండ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం గురించి బయటపడింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దొంగ బాబాతో పాటే బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చన్నట్లు పోలీసులు తెలిపారు.