కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ సంఘటన జరిగింది. మంచంపై నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే కామాంధుడి చేతిలో తీవ్రంగా గాయపడ్డ బాలికను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స చేయాలంటే పోలీసుల (మెడికో లీగల్‌ కేసు) అనుమతి తీసుకురావాలంటూ సిబ్బంది కోరారని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పోలీసులు వచ్చాక గాని వైద్యులు బాలికకు చికిత్స ప్రారంభించలేదన్నారు. 

వైద్యులు నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలపై జిజిహెచ్ సూపరిండెంట్ రాఘవేంధ్రరావు స్పందించారు. బాలికను హాస్పిటల్ కు తీసుకువచ్చిన సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే కాస్త ఆలస్యమయ్యిందన్నారు. వైద్యులు అందుబాటులోకి రాగానే వెంటనే వైద్యసేవలు అందించామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి అమానుషమైన చర్యకు పాల్పడ్డాడు. ఇంట్లో అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లిన ఓ కామాంధుడు శ్మశానవాటికలో అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి సైకో చేష్టలతో బాలిక తీవ్రంగా గాయపడింది.   

అర్థరాత్రి మెలుకువ వచ్చి చూసేసరికి మంచంపై బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్వేషణ ప్రారంభించారు. చివరకు బాలిక ఊరి చివర శ్మశానంలో  ఒంటిపై దుస్తులు లేకుండా శరీరంపై గాయాలతో కనిపించింది. ఇలా తీవ్రంగా గాయపడ్డా బాలికను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.  పోలీసుల అనుమతి లేకుండా వైద్యులు చికిత్స అందించడానికి నిరాకరించారు. దీంతో వైద్యులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.