ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎలాంటి స్వార్థం లేకుండా.. బిడ్డను ప్రేమించగలిగేది తల్లి మాత్రమే. అయితే.. అలాంటి తన తల్లి.. తనని కాకుండా పక్కింటి చిన్నారిని ఎక్కువగా ప్రేమించడం ఆమె కూతురు తట్టుకోలేకపోయింది. ఆ పక్కింటి పాప కారణంగా తన తల్లి తనకు దూరమైపోతుందని భయపడింది. ఈ క్రమంలో.. ఆ పసిదానిపై ఈ బాలిక పగ పెంచుకుంది. చివరకు ఎవరూ చూడకుండా ఆ చిన్నారి నీటి ట్యాంకులో పడేసి హత్య చేసింది. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రాకుకుళం జిల్లా సోంపేట మండలం టి. శాసనాం గ్రామానికి చెందిన ఓ దంపతులకు 11నెలల చిన్నారి హేమ శ్రీ ఉంది. కాగా.. ఆ చిన్నారి చుడగానే ముద్దు వచ్చేలా ఉండటంతో.. పక్కింటి మహిళ ఆ చిన్నారిని తెగ ఇష్టపడేవారు.

హేమశ్రీని పక్కింటికి చెందిన నిర్మల అనే మ హిళ ప్రతి రోజూ ఆడించడానికి తనంటికి తీసుకెళ్లేవారు. పాపను ముద్దుగా చూసుకునేవారు. ఇది ఆ మె కూతురికి నచ్చలేదు. తన తల్లి ఆ చిన్నారిని దగ్గరకు చేర్చడం, ఆడించడం ఆమె చూసి తట్టుకోలేకపోయింది. 

తన అమ్మ తనకు దూరమవుతోందని భయపడింది. పదిహేనేళ్ల వయసు గల ఆ బాలిక హేమశ్రీపై విపరీతమైన కోపం పెంచుకుంది. అదీ కాక తను రోజూ ఫోన్‌లో మాట్లాడుతుంటే తల్లి మందలించేవారు. దీనికి కూడా హేమశ్రీనే కారణమని తప్పుగా భావించుకుంది. దీంతో ఎవరూ లేని సమయంలో  చిన్నారిని తీసుకువెళ్లి.. నీటి ట్యాంకులో పడేసింది. కాగా.. ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాగా.. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసుని చేధించారు. సదరు బాలికను అదుపులోకి తీసుకున్నారు