మా బిడ్డది ఆత్మహత్య కాదు.. హత్యాచారం.. విశాఖ బాలిక కేసులో కొత్తకోణాలు..
పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి తమ కుమార్తె ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ గోడకు చేరబడి కనిపించిందని తెలిపారు. వెళ్ళి చూసే సరికి అప్పటికే ప్రాణాలు పోయాయి అని తెలిపారు. దుస్తులు చిరిగిపోయి, శరీరంపై పెద్దపెద్ద గాట్లు ఉన్నాయని వివరించారు.
విశాఖపట్నం : తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారని visakhapatnamలోని షిరిడి సాయి నగర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 13 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. తమ తల్లిదండ్రులను చూసి భయపడి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు పేర్కొన్నారు.
visakhapatnam minor girl deathను పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి తమ కుమార్తె ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ గోడకు చేరబడి కనిపించిందని తెలిపారు. వెళ్ళి చూసే సరికి అప్పటికే ప్రాణాలు పోయాయి అని తెలిపారు. దుస్తులు చిరిగిపోయి, శరీరంపై పెద్దపెద్ద గాట్లు ఉన్నాయని వివరించారు.
పోలీసులు ఘటనా స్థలి వద్ద ఎలాంటి ఆధారాలు సేకరించకుండా, మృతదేహాన్ని తీసుకు వెళ్లిపోయారని అన్నారు. తమ నివాసానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 101 లో ఉంటున్న ఐదుగురు వ్యక్తులే తన బిడ్డ పై gang rape చేసి, murder చేశారని ఆరోపించారు. ఇదే విషయమై పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కలిసి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి ఫ్లాట్ నెంబర్ 101 తోపాటు, లిఫ్ట్ లో ఉన్న రక్తనమూనాలను సేకరించారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, అక్టోబర్ ఆరున విశాఖపట్నంలో ఓ బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నగరంలోని అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అక్టోబర్ ఐదో తేదీ రాత్రి 9 గంటల నుంచి కుమార్తె కనబడకపోవడంతో బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు.
ఈ క్రమంలో వారికి తాము నివాసముంటున్న పక్క అపార్ట్ మెంట్ లో కుమార్తె శవమై కనిపించింది. మొదట అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు నుంచి దూకి suicideకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దువ్వాడ పోలీసులు అన్వేషించారు. మృతురాలు ఎనిమిదో తరగతి చదువుతున్న పండ్రంకి పావనిగా గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ.. చివరికి హత్యాచారంగా మారుతోంది. అక్టోబర్ 7న దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఎసిపి శీరీషా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి బాలిక మృతి గురించి వివరించారు. బాలికను గత రెండు నెలలుగా దిగుమతి నరేష్ అనే యువకుడు శారీరకంగా వాడుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత బాలిక నరేష్ ను కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. అయితే ఇదే సమయంలో నిద్రలేచిన తండ్రి సత్యం కూతురు కనిపించపోవడంతో వెతకడం ప్రారంభించాడు. కుటుంబసభ్యులు తనను వెతుకుతుండటంతో భయపడిపోయిన బాలిక టెరస్ పైకి వెళ్లింది. అక్కడి నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని ఏసిపి శిరిష వెల్లడించారు. మ్తెనర్ బాలికను లోబర్చుకుని అత్యాచారం చేసినందుకు నరేష్ పై 174 సిఆర్ పిసి, 376 ipc,సెక్షన్ 6 పొక్సో యాక్ట్ నమోదుచేసినట్టు ఎసిపి శీరీష తెలిపారు.