నాలుగేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా మార్టూరు పరిధిలోని గట్టిపాటి హనుమంతరావు నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గట్టిపాటి హనుమంతరావు నగర్ కి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు రోజూ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్తుంటాడు. ఆదివారం సాయంత్రం పదేహారేళ్ల బాలుడు ఆ చిన్నారిని అడ్డుకున్నాడు. చాక్లెట్ కొనిస్తానంటూ చెప్పి ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సోమవారం బాధిత చిన్నారి నొప్పితో బాధపడుతుంటే బంధువులు చిలకలూరి పేట  ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

పరిశీలించిన వైద్యులు లైంగికదాడి జరిగినట్లు గుర్తించారు. కాగా... బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.