Asianet News TeluguAsianet News Telugu

బాబు సర్కార్ అవినీతిని వెలికి తీయాలి: సబ్ కమిటీకి జగన్ ఆదేశం

గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల్లో చోటు చేసుకొన్న అవినీతిని వెలికితీసేందుకు  జగన్ సర్కార్  పనులను వేగవంతం చేసింది. మంత్రుల సబ్ కమిటీ ఆదివారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో  సమావేశమైంది.
 

ministers subcommittee meeting with cm jagan
Author
Amaravathi, First Published Jun 30, 2019, 5:38 PM IST


అమరావతి:  గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల్లో చోటు చేసుకొన్న అవినీతిని వెలికితీసేందుకు  జగన్ సర్కార్  పనులను వేగవంతం చేసింది. మంత్రుల సబ్ కమిటీ ఆదివారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో  సమావేశమైంది.

క్యాంపు కార్యాలయంలో  ఏపీ సీఎం జగన్‌తో  గంటన్నరపాటు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆరు వారాలలోపుగా ఈ సబ్ కమిటీ  ప్రభుత్వానికి నివేదికను ఇవ్వాలి. 

గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల్లో  ఏ శాఖలో అవినీతి జరిగిందనే విషయమై వెలికి తీయాలని సీఎం సబ్ కమిటీ ఆదేశాలు  ఇచ్చారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా కమిటీ పనిచేస్తోంది.

సోమవారంనాడు సెక్రటేరియట్‌లో పలు శాఖలకు చెందిన అధికారులతో  సబ్ కమిటీ భేటీ కానుంది. ప్రతి నాలుగు రోజులకు ఓసారి  సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం సూచించారు. ప్రతి 15 రోజులకు ఓసారి సబ్ కమిటీ  సీఎం జగన్‌తో భేటీ కానున్నారు.  సుమారు 30 అంశాలపై ప్రధానంగా  ఈ కమిటీ కేంద్రీకరించనుంది.

ఇరిగేషన్, రాజధాని భూముల కేటాయింపుల్లో ప్రధానంగా ఆరోపణలు వచ్చిన విషయాన్ని సబ్ కమిటీలోని మంత్రులు మీడియాకు వివరించారు. ప్రాజెక్టుల నుండి పుష్కరాల వరకు దేన్నీ కూడ గత ప్రభుత్వం వదల్లేదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios