నంద్యాల ఉపఎన్నికలో టిడిపి విజయం ఖాయమట. మెజారిటీ ఎంతన్నదే తేలాలట. 20 వేల మెజారిటీ ఖాయమని జోస్యం కూడా చెప్పేసారు.

ఒక సినిమాలో హీరో సైడ్ క్యారెక్టర్ ను ‘అరెవో సాంబా రాసుకో’ అంటూ కొన్ని విషయాలను చెబుతుంటాడు. ఇపుడు అదే స్టైల్ ను మంత్రులు అఖిలప్రియ, కెఎస్ జవహర్ కూడా ఫాలో అవుతున్నట్లున్నారు. విషయమేంటంటే, నంద్యాల ఉపఎన్నికలో టిడిపి విజయం ఖాయమట. మెజారిటీ ఎంతన్నదే తేలాలట. టిడిపికి 20 వేల మెజారిటీ ఖాయమని జోస్యం కూడా చెప్పేసారు. జవహర్, శిల్పా చక్రపాణిరెడ్డి గురించి మాట్లాడుతూ, చక్రపాణి కేవలం ప్రజల మెప్పు కోసం మాత్రమే ఎంఎల్సీకి రాజీనామా చేసారని చెప్పారు. అయితే, వైసీపీ నుండి వచ్చిన 21 మంది ఎంఎల్ఏలు మాత్రం జగన్ దౌర్జన్యాన్ని, ఏకపక్ష ధోరణిని భరించలేకే పార్టీ మారారని పెద్ద జోక్ పేల్చారు.

ఎందుకంటే, ఏకపక్ష ధోరణి ఒక్క వైసీపీలోనే కాదు. టిడిపిలోనూ అంతే. టిడిపిలో మాత్రం చంద్రబాబునాయుడుకు ఎదురుచెప్పే ధైర్యం చేయగలరా? ఇక, రాజీనామాల సంగతంటారా? చక్రపాణి రెడ్డి కనీసం ప్రజల మెప్పుకోసమైనా రాజీనామా చేసారు కదా? చంద్రబాబుకు, ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఆపాటి ధైర్యం కూడా లేకుండా పోయింది కదా? జగన్ దౌర్జన్యపూరిత ధోరణి అని కానీ ఏకపక్ష ధోరణి అని కానీ వైసీపీలో ఉన్నపుడు ఫిరాయింపు ఎంఎల్ఏలు ఎవరైనా జగన్ను నిలదీసారా? నంద్యాలలో అభివృద్ధిపనులు ఏ మేరకు అవుతున్నాయో చూడటనికి మాత్రమే మంత్రులు నంద్యాలకు వెళుతున్నారట. జనాల చెవుల్లో పూలు పెట్టటానికి జవహర్ ఎంత అవస్తలు పడుతున్నారో?