టీడీపీవి శవ రాజకీయాలు: జంగారెడ్డి గూడెం మరణాలపై జగన్

జంగారెడ్డిగూడెంలో  మిస్టరీ మరణాలపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని ఏపీ సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. టీడీపీ శవ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.  సీఎం జగన్ తో మంత్రులు ఇవాళ అసెంబ్లీ వాయిదా పడిన సమయంలో భేటీ అయ్యారు. 
 

Ministers meeting with  AP CM YS Jagan  in AP Assembly


అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా  Jangareddy Gudemలో మిస్టరీ మరణాలపై  TDP శవ రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం YS Jagan అభిప్రాయపడ్డారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఏపీ డిప్యూటీ సీఎం  Alla Nani  Narayana Swamy, మంత్రి perni Nani  తదితరులు సోమవారం నాడు  AP Assemblyలో భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబడడంతో ఏపీ Assembly వాయిదా పడింది.

 ఈ సమయంలో మంత్రులు  సీఎం జగన్ తో భేటీ అయ్యారు. జంగారెడ్డి గూడెం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, ఆళ్ల నానిలు సీఎంకు వివరించారు.  టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని జగన్ మంత్రులతో వ్యాఖ్యానించారు. జంగారెడ్డి గూడెంలో ఏం జరిగిందో ప్రజలకు  వాస్తవ పరిస్థితులు తెలియాల్సిన అవసరం  ఉందని సీఎం జగన్  అభిప్రాయపడ్డారు.  ఈ విషయమై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

జంగారెడ్డిగూడెం లో మిస్టరీ మరణాలపై  టీడీపీ  చీఫ్ చంద్రబాబు నాయుడు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో అసెంబ్లీ వాయిదా పడగానే పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జీ మంత్రి పేర్ని నాని, జిల్లా మంత్రి ఆళ్ల నాని, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిలు  సీఎం జగన్ తో భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై సీఎంకు వివరించారు., కరోనా తర్వాత ఆరోగ్య సమస్యలు తెలెత్తడంతో కొందరు మరణించారని కూడా మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా మరణించారని మంత్రులు సీఎంకు వివరించారు.  ఈ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని  మంత్రులు సీఎంకు చెప్పారు.

ఇటీవల కాలంలో  జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్ల‌నే చనిపోయార‌నే ప్రచారం కూడా లేకపోలేదు. 

ఈ మరణాలపై  ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌డానికి ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి విజ‌య‌వాడ జీజీహెచ్ డాక్ట‌ర్ల టీమ్  జంగారెడ్డి గూడెనికి  చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్ల‌కు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి  వివ‌రాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పారు. ఇందులో ప‌లువురు ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధప‌డుతున్న వారు కూడా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి కొంద‌రు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఉన్నర‌ని పేర్కొన్నారు. అయితే మృతుల కుటుంబీకులు మాత్రం త‌మవారు క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్లనే చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ మ‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు  స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. గురువారం ఒక‌రు హాస్పిట్  ల‌కు వెళ్లిన కొంత స‌మ‌యానికి మృతి చెందారు. అయితే ఆయ‌న మృత‌దేహానికి పోస్టు మార్టం చేయ‌లేదు. ఇలా మృతి చెందిన వారెవ‌రికీ పోస్టు మార్టం నిర్వ‌హించ‌లేదు. దీంతో అస‌లు మ‌ర‌ణాలు ఏ కార‌ణంతో సంభ‌విస్తున్నాయ‌నే అంశంపై ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios