వైసీపీ అధినేత జగన్.. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన స్క్రిప్టును ఫాలో అవుతున్నారని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యనమల మాట్లాడారు. 

పాతమిత్రులతో దోస్తీకి సిద్ధమనడం మోదీ దివాలాకోరుతనమని మంత్రి యనమల దుయ్యబట్టారు. భాగస్వామ్య పక్షాల విశ్వసనీయతను మోదీ ఎప్పుడో కోల్పోయారని ఆయన అన్నారు. ఈ డబ్ల్యూఎస్లకు  10శాతం రిజర్వేషన్లు మోదీ ఎన్నికల జిమ్మిక్కు అని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటనే బలహీనవర్గాలకు భయం పట్టుకుందన్నారు.

నిలబడదని తెలిసీ రిజర్వేషన్లు తేవడం ఈబీసీలకు ద్రోహం చేయడమే అని తెలిపారు. తెలంగాణ ముస్లిం, ఏపీలో కాపుల రిజర్వేషన్లపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేదని మంత్రి నిలదీశారు. ఏపీకి కేంద్ర అధికారులు రూ.32వేల కోట్లు ఇస్తామన్నారు..కానీ..మోదీ అనుమతి కావాలన్నారన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై జగన్‌ నోరు తెరవరని మండిపడ్డారు. జగన్‌ జననేత కాదు..ధన నేత అని వ్యాఖ్యానించారు. జగన్ పుస్తకాల వెనుక స్క్రిప్ట్ మోదీదే అని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.