Asianet News TeluguAsianet News Telugu

సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలు అగ్నికి ఆహుతి: పూర్తిగా దగ్ధమైన మంత్రి విశ్వరూప్ ఇల్లు

మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 500 మంది ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్  ఇంటిపైవిధ్వంసానికి పాల్పడినట్టుగా సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.

Minister Viswarup house set ablaze as violence erupts over renaming of Konaseema district
Author
Guntur, First Published May 25, 2022, 10:38 AM IST

అమలాపురం: Konaseema జిల్లా సాధన సమితి తలపెట్టిన ఆందోళన  ఈ నెల 24వ తేదీన విధ్వంసానికి దారి తీసింది. అమలాపురంలోని  మంత్రి విశ్వరూప్ ఇంటిని  ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మంత్రి Vishwarup ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలు అగ్నికి ఆహుతయ్యాయి. కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని కోరుతూ ఈ నెల 24న  కలెక్టరేట్ ముట్టడిని కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది. 

also read:అమలాపురంలో విధ్వంసానికి పాల్పడిన వారి గుర్తింపు: ఏలూరు రేంజ్ డీఐజీ పాల్‌రాజ్

Collactorate ముట్టడి  విధ్వంసానికి దారి తీసింది. ఆందోళనకారులు YCP  ప్రజా ప్రతినిధుల ఇళ్లపై దాడికి దిగారు.  ఈ నెల 24న సాయంత్రం ఐదున్నర గంటలకు మంత్రి విశ్వరూప ఇంటి వద్దకు ఆందోళనకారులు చేరుకున్నారు. సుమారు ఐదు వందల మంది ఆందోళనకారులు వచ్చి మంత్రి ఇంటిపై విధ్వంసానికి దిగారని అక్కడే విధులు నిర్వహించిన కానిస్టేబుల్ మీడియాకు చెప్పారు. 

Petrol  బాటిల్స్,రాళ్లతో దాడికి దిగారని చెప్పారు.  ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంట్లో ఉన్న మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులను సెక్యూరిటీ సిబ్బంది పై ఫ్లోర్  నుండి కిందకు తీసుకు వచ్చారు.  వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.ఈ దాడి జరిగిన సమయంలో మంత్రి విశ్వరూప్ గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. 

మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఆందోళనకారులు పెట్టిన నిప్పుకు సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఆయుధాల్లో ఉన్న బుల్లెట్లు కూడా పనికిరాకుండాపోయాయి. 

మంత్రి నివాసం వద్ద ఉన్నCC Camera లను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారని విధుల్లో ఉన్న కానిస్టేబుల్ చెప్పారు.  మంత్రి విశ్వరూప్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంత్రి నివాసం వద్ద ఉన్న వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంత్రి నివాసానికి సమీపంలోని మరో ఇంటి వద్ద ఉన్న వాహనం కూడా ధ్వంసమైంది.

ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ నివాసం ఉంటున్న ఇల్లు పూర్తిగా దగ్దమైంది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ నిర్మిస్తున్న మరో ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రి ఇంటిపై విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. బుధవారం నాడు ఉదయం ఎఎస్పీ నేతృత్వంలో పోలీసుల బృందం మంత్రి విశ్వరూప్ ఇంటిని పరిశీలించింది. సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుండి వివరాలను సేకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios