అమలాపురంలో విధ్వంసానికి పాల్పడిన వారి గుర్తింపు: ఏలూరు రేంజ్ డీఐజీ పాల్‌రాజ్
కోనసీమ జిల్లాలోని అమలాపురంలో విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించామని ఏలూరు రేంజ డీఐజీ పాల్ రాజ్ చెప్పారు. విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
అమలాపురం: ఈ నెల 24న Amalapuram లో విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించినట్టుగా Eluruరేంజ్ డీఐజీ పాల్ రాజ్ చెప్పారు.
బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ కి Pal Raj ఇంటర్వ్యూ ఇచ్చారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులుగా Kona seema జిల్లాగానే జిల్లా పేరును కొనసాగించాలని కోరుతూ ఆందోళనకారులు మంగళవారం నాడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
శాంతియుతంగా ఆందోళనలు చేస్తే ఎవరికీ ఇబ్బందులుండవని DIG పాల్ రాజు చెప్పారు. నిన్న అమలాపురంలో జరిగిన ఆందోళనల విషయమై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించామన్నారు. విధ్వంసానికి సంబంధించి మీడియాలో వచ్చిన దృశ్యాలతో పాటు తమ శాఖ ఆధ్వర్యంలో చిత్రీకరించిన వీడియోలతో పాటు నిందితులను గుర్తించామన్నారు. నిందితులపై కఠినంగా శిక్షిస్తామని డీఐజీ పాల్ రాజు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని డీఐజీ ప్రకటించారు. సున్నిత ప్రాంతాల్లో ఎస్పీ లకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఇతర జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించినట్టుగా డీఐజీ వివరించారు.
రెచ్చగొట్టేవారి మాటలు విని తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు డీఐజీ పాల్ రాజు సూచించారు. జిల్లాలో ఎలంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పరిస్థితిని బట్టి ఇంటర్నెట్ సేవలను పునురద్దించే అవకాశాన్ని పరిశీలిస్తామని కూడా డీఐజీ చెప్పారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, ఇచ్చిన వినతి మేరకు ప్రభుత్వం కోనసీమ జిల్లాను డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుగా మార్చాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు నోటీఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల్లో తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని కూడా ఈ నెల 18న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులుగా తొలుత ప్రకటించిన కోనసీమ జిల్లానే కొనసాగించాలని కూడా ఓ వర్గం ఆందోళనలను ప్రారంభించింది.
also read:కోనసీమలో టెన్షన్ టెన్షన్.. కొనసాగుతున్న 144 సెక్షన్.. ఇంటర్‌నెట్ సేవలు బంద్..
కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వారం రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. జేఎసీగా ఏర్పడిన ఆందోళనకారులు ఈ నెల 24న అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అమలాపురం కలెక్టరేట్ ను విఫలం చేసేందుకు పోలీసులు 25 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కానీ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు. అమలాపురంలో YCP ప్రజా ప్రతినిధుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం చేశారు.