లిఫ్ట్‌లో చిక్కుకున్న ఏపీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే అవంతి, అధికారులు..
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌తో పలువురు అధికారులు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు.

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌తో పలువురు అధికారులు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలోనే అక్కడ కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సకాలంలో స్పందించిన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ కీతో లిఫ్ట్ డోర్ తెరిచారు.
వివరాలు.. విశాఖపట్నం ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న విడదల రజినీ ఈరోజు జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో అక్రిడేటెడ్ జర్నలిస్టుకు హెల్త్ క్యాంప్ ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే వెంటనే స్పందించిన డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ కీతో లిఫ్ట్ డోర్ తెరిచారు.
అయితే లిఫ్ట్‌లో ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయిందని చెబుతున్నారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.