Ruia ambulance issue:డెడ్‌బాడీతో వ్యాపారమా? రుయా ఆసుపత్రి సూపరింటెండ్ కు మంత్రి రజని ఫోన్

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన విషయంలో ఆసుపత్రి సూపరింటెండ్ ను ఏపీ ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు ఇవాళ ఏపీ మంత్రి రజని రుయా ఆసుపత్రి సూపరింటెండ్  ఫోన్ చేసింది. 

Minister Vidadala Rajini Phoned To Ruia Hospital Superintendent

అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన విషయంలో ఆసుపత్రి సూపరింటెండ్ వివరణ కోరినట్టుగా ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  Vidadala Rajini చెప్పారు.

ఈ విషయమై మంగళవారం నాడు Ruia ఆసుపత్రి సూపరింటెండ్ తో మంత్రి రజని phoneలో మాట్లాడారు. సోమవారం నాడు రాత్రి Annamaaiah జిల్లా చిట్వేల్ కి చెందిన బాలుడి Dead Body ని తీసుకెళ్లడానికి రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. బయటి నుండి మరో అంబులెన్స్ ను రప్పించినా కూడా ఆ అంబులెన్స్ డ్రైవర్ పై  దాడికి ప్రయత్నించారు. దీంతో కొడుకు డెడ్ బాడీని  తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు. 

ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో మంత్రి విడుదల రజని ఈ విషయమై రుయా ఆసుపత్రి సూపరింటెండ్ తో మాట్లాడారు. మృతదేహంతో వ్యాపారం చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. మహా ప్రస్థానం అంబులెన్స్ లు  24 గంటలు పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకు వస్తామన్నారు. ఆసుపత్రుల్లో ప్రైవేట్ అంబులెన్స్ లను నియంత్రిస్తామని మంత్రి విడుదల రజని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై జిల్లా collector  విచారణకు ఆదేశించారు. మంగళవారం నాడు ఉదయం జిల్లా వైద్యశాఖాధికారి, ఆర్డీఓ,, సూపరింటెండ్ లు విచారణ నిర్వహించారు. అదే విధంగా డీఎస్పీ కూడా ఈ విషయమై విచారణ నిర్వహించి ఆరుగురు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. గత ఏడాదిన్నర క్రితం కూడా రుయా ఆసుపత్రిలో ఇదే తరహా ఘటన చోటు చేసుకొంది. ఆ సమయంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత  అంబులెన్స్ డ్రైవర్లు కొంత తగ్గారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios