తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌లపై  ఏపీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది పవన్‌లు వచ్చిన జగన్‌ను ఏం చేయలేరని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది పవన్‌లు వచ్చిన జగన్‌ను ఏం చేయలేరని అన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవ్వడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. హాయ్ ఏపీ.. బై బై బీపీ.. వన్స్ అగైన్ వైఎస్సార్‌సీపీ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పుత్తూరులో ఆయన విగ్రహానికి మంత్రి రోజా పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా.. పవన్ ఇరిటేషన్ స్టార్.. చంద్రబాబు ఇమిటేషన్ స్టార్ అని విమర్శించారు. వారిద్దరూ ఇనిస్పిరేషన్ స్టార్ సీఎం జగన్ కాలు మీద వెంట్రుక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలోని అర్హులకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా గడప గడపకు పంపుతున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా లబ్దిదారులు మిగిలి ఉంటే.. వారికి కూడా న్యాయం చేసేలా జగనన్న సురక్ష చేపట్టడం జరిగిందని చెప్పారు. 

ప్రజలకు మంచి చేసే గొప్ప మనుసున్న నాయకుడు జగన్ అని.. ఆయనను మళ్లీ గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రికార్డులు సృష్టించాలన్న..ఆయన సృష్టించిన రికార్డులు బ్రేక్ చేయాలన్న అది జగన్‌కే సాధ్యమని అన్నారు.