టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీయే గొప్పదా అని రోజా ట్వీట్ చేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుల భేటీ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రులు జోగి రమేశ్, గుడివాడ అమర్‌నాథ్, అంబటి రాంబాబు తదితరులు ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మంత్రి రోజా స్పందించారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడని, అలాగే చంద్రబాబు వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోతే పవన్ వెళ్లి బాబును పరామర్శిస్తాడని ఆమె ధ్వజమెత్తారు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీయే గొప్పదా అని రోజా ట్వీట్ చేశారు. 

అంతకుముందు చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గంగిరెద్దులు సంక్రాంతికి ఇంటింటికి తిరుగుతాయన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాడని అంబటి రాంబాబు విమర్శించారు. డుడు బసవన్నలా తల ఊపడానికే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యాడన్నారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. 

ALso REad: చంద్రబాబుతో పవన్ భేటీ.. ప్యాంట్లు తడిచిపోతున్నట్లున్నాయి, డైపర్స్ వాడండి : వైసీపీ నేతలకు సోమిరెడ్డి కౌంటర్

సంక్రాంతి మామూళ్ల కోసమే దత్తతండ్రి దగ్గరికి దత్తపుత్రుడు వెళ్లాడని ఏపీ మంత్రి అమర్నాద్ వ్యాఖ్యానించారు. ట్విట్టచ్ వేదికగా అమర్నాద్ ఈ విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని తాము ఎప్పటి నుండే చెబుతున్నామని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గుర్తు చేశారు. రాష్ట్రం కంటే వీళ్ల ప్రయోజనాలే ఈ ఇద్దరికి ముఖ్యమని నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్యాన్ని దోచుకోవడం, దాచుకోవడం కోసమే ఈ ఇద్దరి నేతల ప్రయత్నమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. 

2014లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చాయని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తున్నాడనే పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటున్నామన్నారు. ఈ భేటీతో వీరిద్దరి ముసుగు తొలగిపోయిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీతో వైసీపీ నేతలు, మంత్రులకు ప్యాంట్లు తడిచిపోతున్నట్టున్నాయి... ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్తగా డైపర్స్ వాడండి అంటూ సోమిరెడ్డి సెటైర్లు వేశారు. 

Scroll to load tweet…