ఒక పనికిమాలినోడి పని.. మొత్తం ప్రభుత్వాన్ని అంటారా : టీడీపీపై మంత్రి రోజా ఆగ్రహం

తిరుపతి రుయాలో అంబులెన్స్ వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను నివేదిక కోరినట్లు మంత్రి రోజా వివరించారు. 
 

minister rk roja comments on tirupati ruia hospital incident

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా (minister rk roja) స్పందించారు. రుయా సంఘటన దురదృష్టకరమని ... ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. డెడ్ బాడీకి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వాహనం ఇవ్వలేదని తెలిసిందని.. ఇది సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంవో బాధ్యత అని రోజా చెప్పారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను నివేదిక కోరినట్లు మంత్రి రోజా వివరించారు. ఇప్పటికే ఈ ఘటనలో సీఎస్‌ఆర్‌ఎంవోను సస్పెండ్ చేశామని.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు.

ఒక పనికి మాలిన వాడు చేసిన పనికి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. చంద్రబాబు (chandrababu naidu), లోకేష్ (lokesh) సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. టీడీపీ హయాంలో ఒక్క ప్రభుత్వాస్పత్రిలో కూడా కనీస సదుపాయాలు కల్పించలేకపోయారని రోజా ఆరోపించారు.  టీడీపి (tdp) పరిస్థితి దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎక్కడ తప్పు జరుగుతుందా?? ఎక్కడకు వెళ్లి రాజకీయం చేద్దామా అని చూస్తుంటారని రోజా విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ద్వారా మహిళలను ఏ రకంగా వేధించారో అందరికీ తెలుసన్నారు. టీడీపీ నేతలు ఉన్మాదులు అని.. తమ గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదని రోజా ఫైరయ్యారు. మహిళలందరూ చంద్రబాబును, టీడీపీని తరిమితరిమి కొడతారని రోజా మండిపడ్డారు.

కాగా... Tirupati లోని Ruia ఆసుపత్రి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ Bharatiకి షోకాజ్ నోటీసు ఇవ్వగా.. RMOను సస్పెండ్ చేశారు. మరో వైపు అంబులెన్స్ ధరలను నిర్ణయించేందుకు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

అసలేం జరిగిందంటే:

Annamaiah జిల్లాలోని Chitvel కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకును చికిత్స కోసం రుయా ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయాడు. అయితే 10 ఏళ్ల బాలుడి డెడ్ బాడీని స్వగ్రామం తీసుకెళ్లేందుకు రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. అయితే బయటి నుండి అంబులెన్స్‌ను తెప్పించుకొన్నా కూడా రుయా ఆసుపత్రిలోని డ్రైవర్లు అడ్డుకొన్నారు. బయటి నుండి వచ్చిన అంబులెన్స్  డ్రైవర్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios