రేషన్ సరుకుల్లో అవికూడా చేర్చాం, అతి తక్కువ ధరలకే అందిస్తాం: మంత్రి ప్రత్తిపాటి

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 13, Aug 2018, 1:03 PM IST
minister prattipati pullarao sudden inspection on ration shop
Highlights

రాష్ట్రంలోని నిరుపేదలకు మంచి పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశ్యంతో ప్రస్తుతం అందించే రేషన్ సరుకులకు అదనంగా మరికొన్ని వస్తువులను చేర్చినట్లు పౌరసరఫరా శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్టోబర్ 1 నుండి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకే రాగులు, జొన్నలు సరఫరా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే పామాయిల్ ను కూడా సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

విజయవాడలోని కృష్ణలంక నెహ్రూనగర్ లో గల రేషన్ షాపులో ఇవాళ ఉదయం మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... నిత్యావసర వస్తువుల పంపిణీలో ఈ రేషన్ షాపుపై ప్రజా సంతృప్తి స్థాయి 37 శాతమే ఉండటంతో విచారించేందుకే ఇలా తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అయితే అనారోగ్యం కారణంగానే జాప్యం
జరింగిందని డీలర్ సంజాయిషీ ఇచ్చుకున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజలు డీలర్ సమయ పాలన, సరుకుల పంపిణీ, తూకం పై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజా సంతృప్తి శాతం 95 శాతానికి పెంచడానికి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

ఇలా సామాజిక తనిఖీ చెప్పట్టడం ద్వారా పారదర్శకత పెంచడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి రాగులు, జొన్నలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. లీటర్ పామాయిల్ పై రూ.20 సబ్సిడీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే దాన్ని కూడా రేషన్ షాపుల ద్వారా అందించడానికి సిద్దంగా ఉన్నట్లు పుల్లారావు తెలిపారు.

మంత్రి పుల్లారావు తో పాటు పౌరసరఫరా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకుమారి, జిల్లా సరఫరా అధికారి నాగేశ్వరరావు, సహాయ సరఫరా అధికారి ఉదయ్ భాస్కర్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
 
loader