ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య ఘర్షణపూరిత వాతావరణం తీసుకొచ్చేలా ప్రసంగాలు చేయడం ఏ నాయకుడికీ మంచిది కాదని హితవు పలికారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తనకు కొందరి నుంచి ప్రాణహాని ఉంది అంటూ..కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎవరి నుంచి హాని ఉందో చెప్పాలని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. వారి పేర్లు బయటపెడితే.. పవన్ కి తగిన భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అనుమానితుల పేర్లను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య ఘర్షణపూరిత వాతావరణం తీసుకొచ్చేలా ప్రసంగాలు చేయడం ఏ నాయకుడికీ మంచిది కాదని హితవు పలికారు. కొల్లేరు ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతోందన్నారు. ప్రశాంతతకు, అభివృద్ధికి మారుపేరుగా ఉండే ఉభయగోదావరి జిల్లాలపై సీఎంకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు.