టెస్టులు చేస్తుంటే... కేసులు పెరగడం సహజం: టీడీపీపై మోపిదేవి విసుర్లు
కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ
కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. తాడేపల్లిలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యాకారులు బతుకుదెరువు కోసం గుజరాత్, తమిళనాడు, కర్నాటకలోని మంగళూరు పోర్టులకు సీజనల్ వైజ్‌గా వలసలు వెళ్లారని అని చెప్పారు.
ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారని మోపిదేవి చెప్పారు. 20 రోజుల క్రితం మంగళూరు పోర్టు నుంచి మన రాష్ట్ర బోర్డర్‌కు వచ్చిన సుమారు 1,700 మందిని ఆయా జిల్లాలకు పంపించి, క్వారంటైన్ చేయించినట్లు మంత్రి తెలిపారు.
Also Read:లాక్‌డౌన్ సడలింపులపై ఏపీ సర్కార్ కొత్త గైడ్‌లైన్స్: మినహయింపులు వీటికే
వైద్య పరీక్షల అనంతరం వారిని స్వస్థలాలకు పంపించామని మోపిదేవి చెప్పారు. మత్స్యకారులను స్వస్థలాలకు రప్పించడానికి చర్యలు తీసుకునేందుకు కొన్ని కారణాల వల్ల కాలయాపన జరిగిందని, ఈలోగా ఇద్దరు మత్స్యకారులు మరణించినట్లు మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ చొరవ తీసుకున్నారని మోపిదేవి గుర్తుచేశారు.
గుజరాత్ వేరవల్ పోర్టులో 4,052 మంది ఉంటే వారిలో 2,852మంది శ్రీకాకుళంజిల్లాకు చెందిన వారుండగా, 636 మంది విజయనగరం ,304 మంది విశాఖపట్నం,21 మంది తూర్పుగోదావరి,24 మంది పశ్చిమగోదావరి,ఒకరు కృష్ణా జిల్లా నుంచి మొత్తం 3,838 మంది ఉన్నారని మంత్రి చెప్పారు.
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవడంలో గాని, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసే విషయంలో అగ్రస్దానంలో ఉందని మోపిదేవి తెలిపారు. జగన్ పరిపాలన,ఆయన తీసుకువస్తున్న సంస్కరణలు,తీసుకుంటున్న నిర్ణయాలు ఆదర్శవంతంగా ఉంటున్నాయని జాతీయస్దాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.
Also Read:ఏపీలో ఆగని కరోనా విజృంభణ: మరో 73 కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1,332
కోవిడ్ ను అరికట్టలేకపోయామని చంద్రబాబు లాంటివారు మాట్లాడటం సరైంది కాదని, రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ పెరిగిందని మంత్రి తెలిపారు. పరీక్షల సంఖ్య పెరుగుతుంటే పాజిటివ్ కేసులు కూడా కొంత పెరగడం సహజంగా జరుగుతుందని మోపిదేవి వెల్లడించారు.
ప్రభుత్వం ఇన్ని రకాల చర్యలు చేపడుతుంటే అభినందించాల్సిందిపోయి ఇలాంటి విపత్కర పరిస్దితులలోకూడా రాజకీయం చేయడం దుర్మార్గమని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా వ్యాప్తికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలు,మంత్రులు కారణమంటూ చంద్రబాబు ఆరోపించడం సరైంది కాదని వెంకటరమణ హితవు పలికారు.