Asianet News TeluguAsianet News Telugu

60 లక్షల మంది సబ్ స్క్రైబర్లే లక్ష్యం: మంత్రి మేకపాటి

మరింత చౌకగా ఇంటర్ నెట్...నాణ్యతగా ఫైబర్ నెట్ సేవలందించడమే టార్గెట్ గా పెట్టుకున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 

minister mekapati goutham reddy review meeting on  APSFL
Author
Amaravathi, First Published Jul 15, 2020, 7:50 PM IST

అమరావతి: మరింత చౌకగా ఇంటర్ నెట్...నాణ్యతగా ఫైబర్ నెట్ సేవలందించడమే టార్గెట్ గా పెట్టుకున్నామని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఫైబర్ నెట్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రానున్న 2-3 ఏళ్ల కాలంలో 60 లక్షల మంది సబ్ స్క్రైబర్లకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ఇప్పటికే 10 లక్షల మందికి పైగా సబ్ స్కైబర్స్ వున్నారన్నారు.

బుధవారం తన కార్యాలయంలో గౌతమ్ రెడ్డి ఏపీఎస్ఎఫ్ఎల్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి లె పాల్గొన్నారు.   

read more  అరుకు సైతం, కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటి: ఏపీ కేబినెట్ నిర్ణయం

గ్రామపంచాయతీ, మండలలో రూటర్ల సంఖ్య వీలైనంత వరకూ తగ్గించడంపై దృష్టి పెట్టామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా చూడడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి ఇంటర్నెట్ తీసుకువస్తామని... నిర్దేశించుకున్న గ్రామ పంచాయతీలు, మండలాలలో పక్కాగా ఫైబర్ నెట్ వర్క్ సేవలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు వెన్నుముకగా IP-MPLS, GPON టెక్నాలజీ  మారనుందని మంత్రి పేర్కొన్నారు. 

రూటర్ల ఇన్ స్టాలేషన్ లో మరింత పారదర్శకత... కొత్త పరికరాల సేకరణ, అంచనా, ఆర్థిక భారం తగ్గించేందుకు 'టెక్నికల్ కమిటీ' ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా దశలవారీగా కొత్త సబ్ స్క్రైబర్ల పెంపుకు చర్యలు తీసుకుంటునట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios