Asianet News TeluguAsianet News Telugu

జగన్ నకిలీ..వైసిపి నకిలీ

  • గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
Minister lokesh fires on ys jagan

గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్ ఓ నకిలీ నాయకుడు, వైసిపి ఓ నకిలీ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ‘దురదృష్టవశాత్తు ఒక నకిలీ నాయకుడు నడుతున్న ఓ నకిలీ పార్టీ మనకు ఉంది’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఆయనకు ఓ మీడియా సంస్ధ కూడా ఉంది అది కూడా నకిలీ సమాచారంపైనే నడుస్తుంది’ అని లోకేష్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ నకిలీ వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రుజువైంది’ అంటూ ఎగతాళి చేసారు.

This proves that the Opposition party clearly propagates fake news and misleads people. Unfortunate to see that we have a fake party run by a fake leader who also runs a media house that thrives on fake information. pic.twitter.com/h25Gdpkdzh

జగన్ పాదయాత్ర సందర్భంగా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని ఓబీ నాయక్ తండాకు చెందిన బాలనాగమ్మ జగన్ ను కలసి రేషన్ బియ్యం అందకపోవటంపై ఫిర్యాదు చేసినట్లు జగన్ మీడియాలో వచ్చింది. అదే విషయమై లోకేష్ స్పందిస్తూ తండాలో బియ్యం తీసుకున్న వారి జాబితాలో  బాలనాగమ్మ కూడా ఉందంటూ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. బియ్యం తీసుకున్న వారి జాబితాను సైతం లోకేష్ అందుబాటులో ఉంచటం గమనార్హం.

If you have grievances under Panchayat Raj/Water, mention details of your village/mandal/contact no. with hashtags like #APWater #APRoads

— Lokesh Nara (@naralokesh) October 11, 2017

చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో జగన్ మొదలుపెట్టిన పాదయాత్రకు జనాల నుండి అపూర్వ స్పందన కనిపిస్తోంది. దాంతో టిడిపి ఆత్మరక్షణలో పడింది. ప్రతిపక్ష నేత చేస్తున్న పాదయాత్రకు జనాలు విపరీతంగా స్పందిస్తున్నారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది. దాంతో టిడిపి నేతలు గింజుకుంటున్నారు. అందుకనే బాలనాగమ్మ రేఫన్ బియ్యం అంశాన్ని లోకేష్ పట్టుకుని జగన్, వైసిపిపై మండిపడుతున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios