సినిమా టికెట్ల (movie ticket rates issue) విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని (kodali nani). రాం గోపాల్ వర్మకు (ramgopal varma) కొడాలి నాని తెలియకపోవడం ఆశ్చర్యం కాదంటూ చురకలు వేశారు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది... ఇక్కడ ముఖ్యమంత్రి వున్నారు అని ఇప్పుడే చాలా మందికి తెలుస్తోందంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్ల (movie ticket rates issue) విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని (kodali nani) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు , ఎల్లో మీడియా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య కథనాలు రాస్తున్నారని నాని మండిపడ్డారు. చంద్రబాబు (chandrababu naidu) అబద్ధాలను ప్రచురిస్తూ రామోజీరావు (ramoji rao) దిగజారిపోయారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలపై దుష్ప్రపచారం చేస్తున్నారని.. మార్కెట్‌లో వున్న ధరలకన్నా అధికార ధరలు వున్నట్లు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. సిమెంట్ బస్తాను రూ.230కి ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని కొడాలి నాని అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ప్రజల సొమ్మును లూటీ చేశారని కొడాలి నాని ఆరోపించారు. ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నామని నాని స్పష్టం చేశారు.
చంద్రబాబు చెప్పే రేట్ల కంటే హెరిటేజ్ లో (heritage) నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్నాయని నాని ధ్వజమెత్తారు. బ్లాక్ మార్కెట్ చేసే దొంగ చంద్రబాబంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ (tdp) పార్టీ ని బలోపేతం చేసుకోవాలి అంటే, చంద్రబాబు ని పక్కన పెట్టాలని మంత్రి సూచించారు. చంద్రబాబు సీఎం అయితే నేను రాష్ట్రాన్ని వదిలిపోతానని.. చంద్రబాబు ఓడిపోతే హైదరాబాద్ లోను, మీ ఊర్లోనో వుంటావా అని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో ఎయిర్‌పోర్ట్, రింగ్ రోడ్డు వైఎస్సార్ (ys rajasekhara reddy) హయాంలో వేశారని నాని గుర్తుచేశారు.
ఎయిర్‌పోర్ట్, రింగ్ రోడ్డు చంద్రబాబు వేసినట్లు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తానని నాని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ చంద్రబాబని... సీఎం జగన్ రాష్ట్రానికి పట్టిన అదృష్టమన్నారు. రాం గోపాల్ వర్మకు (ramgopal varma) కొడాలి నాని తెలియకపోవడం ఆశ్చర్యం కాదంటూ చురకలు వేశారు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది... ఇక్కడ ముఖ్యమంత్రి వున్నారు అని ఇప్పుడే చాలా మందికి తెలుస్తోందంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా.. నాకు నాచురల్ స్టార్ నాని తప్పితే కొడాలి నాని ఎవరో తెలియదని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. నానిపై కౌంటర్ వేస్తూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరోవైపు వర్మ పరిశ్రమలో అందరినీ కూడగడుతున్నారు. టికెట్స్ ధరల తగ్గింపుపై అందరూ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడూ మాట్లాడలేరని, ఆపై మీ ఖర్మ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు ఆర్జీవీ కి మద్దతుగా ట్వీట్ చేశారు. వర్మ వాదనలో నిజం ఉందని అతని వైపు నిలబడ్డాడు.
వర్మ టికెట్స్ ధరల విషయం ఇంత సీరియస్ గా తీసుకుంటాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అందులోనూ ఈ వివాదం మూడు నెలలుగా నడుస్తుండగా... వర్మ సైలెంట్ గా ఉన్నారు. గత వారం రోజులుగా వర్మ టీవీ డిబేట్లలో పాల్గొంటూ, ట్వీట్స్ చేస్తూ, వీడియో బైట్స్ విడుదల చేస్తూ తన వ్యతిరేకత తీవ్రతరం చేశారు. వర్మ ఈ పోరాటం ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దగ్గర కావడం విశేషం. ఇప్పుడు సోషల్ మీడియాలో వర్మకు మద్దతు ప్రకటిస్తున్నవారిలో మెజారిటీ వర్గం పవన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కావడం విశేషం. పవన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సినిమాలు తీసే వర్మ అంటే ఫ్యాన్స్ కి మామూలు కోపం కాదు. అయితే తమ హీరో వ్యతిరేకించే వైసీపీ ప్రభుత్వంపై వర్మ పోరాటం చేయడంతో వారు వర్మ వైపుకు తిరిగారు.
