ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్... కోర్టుకు హాజరైతే తప్పేంటని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లినంత మాత్రానా జగన్ సీఎంగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్... ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరౌతున్న సంగతి తెలిసిందే. కాగా... వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ని న్యాయస్థానం తిరస్కరించింది. కోర్టుకు హాజరు  కావాల్సిందేనని తేల్చిచెప్పింది.

కోర్టు ఇచ్చిన తీర్పుని  ప్రతిపక్ష పార్టీ నేతలకు తమకు అనుకూలంగా చేసుకున్నారు. సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం అయ్యి ఉండి కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని దుయ్యబడుతున్నారు. రాష్ట్ర ప్రతిష్టను కోర్టులో పెట్టారంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కి మద్దుతుగా నిలిచారు మంత్రి కొడాలి నాని. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

read more  సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

‘‘కోర్టులు చట్టవ్యతిరేక జూదశాలలు కాదుకదా! ఎవరైనా వెళ్లొచ్చు. చంద్రబాబు, సోనియా గాంధీ, జనసేన ముఖ్యులు కలిసి అక్రమంగా సీఎం జగన్‌పై కేసులు పెట్టారు. సీబీఐ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. మరోవైపు... సీఎం కోర్టుకు హాజరయ్యే విషయంలో ఖర్చుతో సమస్య లేదని.. ముఖ్యమంత్రిగా ఆయన కీలకమైన సమయం వృథా అవుతుందని పేర్ని నాని పేర్కొన్నారు.

ఇదిలా  ఉండగా... జగన్ పై కేసు విషయమై వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు  చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనమీదున్న 11కేసుల విచారణకి సంబంధించి వారంవారం సీబీఐకోర్టుకి రాలేనని, తనతరుపున న్యాయవాది హాజరవు తారని వేసిన పిటిషన్‌ ను సీబీఐ కోర్టు తిరస్కరించడం చాలా మంచి పరిణామమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య పేర్కొన్నారు. జగన్‌ అధికారం, హోదా వంటివి చూసి మినహాయింపులు ఇవ్వడం కుదరదని... ప్రతి శుక్రవారం తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరుకావాలని సుస్పష్టంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో న్యాయవ్యవస్థకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నానని ఆయన తెలిపారు. 

read more రాస్కో చూస్కో అన్నారు, ఇప్పుడేమంటారు : బాబును నిలదీసిన మంత్రి అనిల్

శుక్రవారం ఆయన గుంటూరు లోని పార్టీరాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తి, తనకుతాను ప్రత్యేకస్థానాన్ని ఆపాదిం చుకుంటూ, న్యాయస్థానాలకు హాజరు కాకుండా మినహాయింపు కోరడమేతప్పని రామయ్య స్పష్టంచేశారు. ముఖ్యమంత్రైనా, ప్రధానమంత్రైనా, సామాన్యుడైనా, రిక్షాతొక్కేవాడైనా చట్టంముందు అందరూ సమానమనే విషయాన్ని మర్చిపోయిన జగన్ ప్రత్యేకమినహాయింపు కోరుతూ చట్టాన్నే ఛాలెంజ్‌ చేశాడన్నారు. 

న్యాయస్థానాలపై ప్రజలకు ఒకనమ్మకం, ధైర్యం కల్పించేలా.. న్యాయవ్యవస్థలు వాటికాళ్లపై అవే నిలబడ్డాయనే సంకేతం ప్రజల్లోకి వెళ్లేలా సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందన్నారు. వారంవారం తానుకోర్టుకు హాజరైతే రూ.60లక్షలు ఖర్చవుతాయని జగన్మోహన్‌రెడ్డి తన అఫిడవిట్‌లో చెప్పడం ఇప్పటికీ విడ్డూరంగా ఉందన్నారు.  

read more రాష్ట్రంలో ముద్దాయిల పాలన...జగన్ బయటపడటం కష్టమే...: వర్ల రామయ్య

విమానంలో వెళ్లినా కూడా రూ.60లక్షలు కావని, ఎన్నిలక్షలు ఖర్చయినా, ప్రభుత్వ ఖజానా నుంచి జగన్మోహన్‌రెడ్డి ఒక్కరూపాయికూడా వాడటానికి వీల్లేదని వర్ల తేల్చిచెప్పారు. సీబీఐ వేసిన 11 ఛార్జ్‌షీట్లన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై వేయలేదని, వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సన్నాఫ్‌ రాజశేఖర్‌రెడ్డిపై మోపబడ్డాయన్నారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులకు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి సంబంధం లేనప్పుడు రూ.60లక్షలు ఎలా ఖర్చవుతుందని రామయ్య ప్రశ్నించారు. 

రూపాయి కూడా రాష్ట్రప్రభుత్వం భరించదని, వ్యక్తిగతంగా జగన్మోహన్‌రెడ్డి తనసొంత నిధులే వాడుకోవాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు కొట్టేశారని... రూ.43వేలకోట్లు జప్తుచేయడమైందని, క్విడ్‌ప్రోకోతో లబ్దిపొందిన పారిశ్రామికవేత్తలు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ తన అఫిడవిట్లలో స్పష్టంగా పేర్కొన్నదని రామయ్య వివరించారు. 

రూ.60లక్షలు ఖర్చవుతాయని కోర్టుకి తప్పుడుసమాచారం ఇచ్చినందుకు జగన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. జగన్‌పై ఉన్న కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావడానికి రాష్ట్రప్రభుత్వం ఐఏఎస్‌లకు డబ్బులు విడుదలచేస్తే, వాటిలో రూ.7లక్షల40వేలను ముగ్గురు ఐఏఎస్‌లు కొట్టేయడం దారుణమన్నారు. అటువంటి వ్యక్తులను జగన్మోహన్‌రెడ్డి తన సలహాదారులగా నియమించుకున్నారని, తనకు సంబంధించిన కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారు. 


ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో  మీడియాకు ముఖం చాటేశాడని వర్ల ఎద్దేవాచేశారు. పరిపాలనలో 6వనెలలోకి అడుగు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించకపోవడం విచిత్రంగా ఉందని వర్ల ఎద్దేవాచేశారు. ఆరునెలల పాలనలో ముఖ్యమంత్రి ప్రసారమాధ్యమాలతో మాట్లాడకపోవడం ఒక్క ఆంధ్రరాష్ట్రంలో తప్పదేశంలో ఎక్కడాజరగలేదన్నారు.

 ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డిపై ఛార్జ్‌షీట్లు వేసి 6 ఏళ్లయిందని, ఏదో ఒకవంకతో కేసులవిచారణ సజావుగా జరగకుండా ఆయన అడ్డుకుంటున్నాడని స్వయంగా సీబీఐ తన అఫిడవిట్‌లో  పేర్కొన్నదని, ఇది ఎంతవరకు న్యాయమో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని రామయ్య   డిమాండ్‌ చేశారు. ఆరేళ్లక్రితం జగన్‌పై సీబీఐ చార్జ్‌షీట్లు వేస్తే, ఇంతవరకు కేసులవిచార ణలో ఏవిధమైన పురోగతి లేకపోతే, జగన్‌ని కోర్టుకి హాజరుకాకుండా వదిలేస్తే ఆయనపై ఉన్న కేసులన్నీ ఏమవుతాయన్నారు. 

జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి, కోర్టులపట్ల గౌరవం ఉన్నా, తన కేసుల విచారణ వేగవంతం చేయాలని, తప్పుచేస్తే శిక్షించాలని, లేకపోతే వదిలేయాలని కోరుతూ, సీబీఐకోర్టులో తనకుతానుగా ఆయన వెంటనే అఫిడవిట్‌ దాఖలు చేయాలని వర్ల హితవుపలికారు. రాష్ట్రముఖ్యమంత్రిగా ఆయన ఇన్నికేసులతో సతమతమవడం మంచిదికాదన్నారు. చిదంబరం కేసువిచారణ చూశాక, తనకేసుల్లో నుంచి జగన్మోహన్‌రెడ్డి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని టీడీపీనేత స్పష్టంచేశారు.