చంద్రబాబు రసం పీల్చే పురుగు.. అందుకే 2019లో మందు కొట్టారు: కన్నబాబు సెటైర్లు
టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు మంత్రి కన్నబాబు (kannababu). చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు అంటూ సెటైర్లు వేశారు. 2019లో చంద్రబాబుకు ప్రజలు పురుగు మందు కొట్టారంటూ వ్యాఖ్యానించారు. పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచి చూస్తున్నామంటూ కన్నబాబు ఎద్దేవా చేశారు.
టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు మంత్రి కన్నబాబు (kannababu). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తామర పురుగుతో రైతులు నష్టపోయారని... చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు అంటూ సెటైర్లు వేశారు. 2019లో చంద్రబాబుకు ప్రజలు పురుగు మందు కొట్టారంటూ వ్యాఖ్యానించారు. పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచి చూస్తున్నామంటూ కన్నబాబు ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ని చంద్రబాబు భ్రష్టు పట్టించారంటూ మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియఎస్టేట్ ప్రయోజనాలని చంద్రబాబు అనుకున్నారంటూ కన్నబాబు విమర్శించారు. సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి రాజధాని (amaravathi) పెట్టారని ఆరోపించారు. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటంటూ మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో (NTR Bhavan) నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల (nellore corporation election)పై చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. ఎంతమందిని చంపుతారు... ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారని వైసిపి (ycp) పార్టీని నిలదీసారు.
Also Read:ఈ ఆకురౌడీలు నాకో లెక్కకాదు... వారి కథ తేలుస్తా..: వైసిపి నాయకులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
''నా 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశా...పెద్దపెద్ద గూండాలను చూశా...నెల్లూరులో ఇప్పుడున్న ఆకురౌడీలు నాకో లెక్కకాదు... వారి కథ తేలుస్తా... ధైర్యంగా ఉండండి... ఆకురౌడీలకు భయపడకండి...నేనున్నాను. టిడిపిది 70లక్షల సైన్యం...అందరం కలసికట్టుగా తిరగబడితే పారిపోతారు...ఎవరూ భయపడొద్దు'' అని చంద్రబాబు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
''నెల్లూరు ప్రజలు శాంతికాముఖులు...మాఫియాలను, గూండాలను సింహపురి ప్రజలు ఆదరించిన దాఖలాలు చరిత్రలో లేవు. ఇకపై నేను ముందుండి పోరాడతా... నా వెనుక కలసిరండి... వారి సంగతి చూద్దాం'' అని టిడిపి శ్రేణులకు సూచించారు. ''నెల్లూరు (nellore)నగరాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశాం, 40వేల ఇళ్లు టిడ్కో ఇళ్లు కట్టాం. అయినా ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో చేసినది చెప్పుకోవడంలో విఫలమయ్యాం. అధికారపార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచడంలో స్థానిక నేతలు విఫలమయ్యారు. నెల్లూరులో నాయకత్వ లోపం స్పష్టం కన్పిస్తోంది. .ప్రక్షాళన చేసి తీరుతాం. 15రోజుల్లో సమర్థులతో నెల్లూరులో అన్ని డివిజన్ లో కమిటీలు ఏర్పాటుచేస్తాం'' అని చంద్రబాబు ప్రకటించారు.