అగ్రిగోల్డ్ అంశంలో టీడీపీపై బీజేపీ వ్యాఖ్యలకు మంత్రి కాల్వ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు.  

అమరావతి: అగ్రిగోల్డ్ అంశంలో టీడీపీపై బీజేపీ వ్యాఖ్యలకు మంత్రి కాల్వ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే రూ.60వేలు లోపు డిపాజిట్లను బాధితులకు వెంటనే చెల్లించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

ఇతర రాష్ట్రాల్లో డిఫాల్టర్లకు ఇలాంటి సహాయం అందుతుందా అని ప్రశ్నించారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ కేసు పురోగతిని సమీక్ష చేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం తరఫున ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నదానిపై సమీక్ష చేస్తున్నట్లు కాల్వ తెలిపారు. ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం తమలా పట్టించుకోవడం లేదన్నారు. 

అగ్రిగోల్డ్ విషయంలో కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. ఎవరు ఎన్ని చేసినా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో కొత్త ప్రభుత్వం, బీజేపీదీ కీలకపాత్ర: రామ్ మాధవ్

కారు చౌకగా అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసే యత్నం: కన్నా

అగ్రిగోల్డ్ బాధితులను టీడీపీయే అదుకుంటుంది:మంత్రి కాల్వ

ఏపీలో లాలూ ప్రసాద్‌ తరహా ప్రభుత్వం, 6నెలల్లో టీడీపీ క్లోజ్:జీవీఎల్