విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించారు మంత్రి జోగి రమేశ్. జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేశ్ హెచ్చరించారు. 

విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రి జోగి రమేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాన్వాయ్‌పై జనసేన కార్యకర్తలు చేసిన దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. జనసేనది చిల్లర వ్యవహారమని.. మాపై దాడి చేస్తే ఏం వస్తుందని జోగి రమేశ్ ప్రశ్నించారు. అరాచకవాదులందరినీ పవన్ చేరదీస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని చూసి కవ్వించే కార్యక్రమాలకు జనసేన కార్యకర్తలు దిగారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ అనే తమ కార్యకర్తని చావబాదారని.. రక్తం కారుతున్నా వదల్లేదని జోగి రమేశ్ అన్నారు. జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేశ్ హెచ్చరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ALso Read:రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన శ్రేణుల దాడి.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత

అసలేం జరిగిందంటే:

వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ ఇతర వైసీపీ నేతలు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు.