Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కుమారులు పరమశుంఠలు.. బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్‌: మంత్రి జోగి రమేష్ సంచలన కామెంట్స్

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్‌లో చెబుతాడని.. బయట మాత్రం దద్దమ్మ అని విమర్శించారు.

Minister jogi ramesh Slams Nandamuri Balakrishna
Author
First Published Sep 24, 2022, 4:54 PM IST

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్‌లో చెబుతాడని.. బయట మాత్రం దద్దమ్మ అని విమర్శించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు కూలదోసినప్పుడు బాలకృష్ణ ఏం చేశారని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా గుర్తుండే విధంగా తమ నాయకుడు వైఎస్ జగన్ చేశారని చెప్పారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. 

ఈ జాతికి ఎన్టీఆర్‌ను దూరం చేసింది ఎవరని జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను చరిత్ర పుటల్లో నిలపాలనే ఆలోచన ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ సంతోషంతో ఒక్క మాటైన మాట్లాడారా అని అడిగారు. పార్టీని లాక్కొన్ని బాలకృష్ణ బావ చంద్రబాబు సీఎం పీఠం మీద కూర్చొలేదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమారులు చవటలు, పరమశుంఠలు అని విమర్శించారు. మీరే అస్సలైన శునకాలు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నందమూరి కేరాఫ్ అన్నాడు.. ఇప్పుడు నందమూరి వాళ్ల కేరాఫ్ నారా అయిపోందని విమర్శించారు. శునకాలు అయిపోయి.. చంద్రబాబు శునకం దగ్గర చవట సన్నాసుల్లాగా చేరిపోయారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బాధ్యతలు, బంధాలు వదిలేసి..ఎంగిలి మెతుకుల కోసం చంద్రబాబు పంచన చేరారని విమర్శించారు. 

Also Read: మార్చెయ్యటానికీ ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..: నందమూరి బాలకృష్ణ హెచ్చరిక

బాలకృష్ణకు ఎన్టీఆర్‌  జన్మనిచ్చారని.. కానీ పునర్జన్మనిచ్చింది మాత్రం వైఎస్సార్ అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. బాలకృష్ణకు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. పునర్జన్మనిచ్చిన వైఎస్సార్‌కు, కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన వైఎస్ జగన్‌కు రుణపడాల్సి ఉందన్నారు. 

హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెడతామని వారం రోజులుగా వార్తలు వచ్చాయని.. మరి అలాంటప్పుడు బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తండ్రిని చంపిన వ్యక్తికి పిల్లను ఇచ్చాడంటే బాలకృష్ణను ఏమనాలని ప్రశ్నించారు. యూనివర్సిటీ అనేది చాలా చిన్నదని.. జిల్లా అనేది చాలా పెద్దదని అన్నారు.  హిందూపురంను హెడ్ క్వార్టర్ చేయమని బాలకృష్ణ కోరారని.. కానీ ఎన్టీఆర్ పేరు పెట్టమని ఆడగలేదని అన్నారు.  బాలకృష్ణ ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుడితే.. పౌరుషం ఉంటే.. ఇప్పటికైనా కాలజ్ఞానం అయితే.. ఇప్పటికైనా చంద్రబాబుకు బుద్ది చెప్పాలని కోరారు. బాలకృష్ణను ఎవరూ నమ్మరని అన్నారు. బాలకృష్ణ సినిమాల వరకే పరిమితం అని అన్నారు. ట్వీట్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్స్‌ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. వైఎస్ షర్మిల అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలు వినిఉండరని అనుకుంటున్నానని చెప్పారు. విని ఉంటే షర్మిల అలా మాట్లాడి ఉండేవారు కాదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios