Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష చెప్పడానికే విశాఖ గర్జన.. అన్ని వర్గాలు పాల్గొంటాయి: మంత్రి అమర్‌నాథ్

వికేంద్రీకరణ మద్దతుగా ఏర్పాటైన నాన్ పొలిటికల్ జేఏసీ.. ఈ నెల 15న విశాఖలో ఉత్తరాంధ్ర గర్జనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన పోస్టర్‌ను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆవిష్కరించారు.

Minister Gudivada Amarnath unveils Visakha Garjana poster in support of three capitals
Author
First Published Oct 12, 2022, 11:53 AM IST

వికేంద్రీకరణ మద్దతుగా ఏర్పాటైన నాన్ పొలిటికల్ జేఏసీ.. ఈ నెల 15న విశాఖలో ఉత్తరాంధ్ర గర్జనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన పోస్టర్‌ను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ.. విశాఖ గర్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష చెప్పడానికే.. విశాఖ గర్జన అని చెప్పారు. దండయాత్రగా వస్తామంటే ఉత్తరాంధ్రకు ద్రోహం చేసినట్టేనని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖపట్నంకు రావడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. 

మంత్రి అవంతి శ్రీనివాస్.. ఉత్తరాంధ్రలో రాజధాని ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. అమరావతి రాజధాని వద్దని తాము చెప్పడం లేదని చెప్పారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలుకు కూడా న్యాయం చేయమని ప్రజలు కోరుతున్నారని అన్నారు. విశాఖలో గర్జన అనగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేశారని విమర్శించారు. ఉత్తరాంధ్ర గర్జన రోజే విశాఖలో పవన్ కల్యాణ్ మీటింగ్ అవసరమా? అని ప్రశ్నించారు. 

ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉందని.. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలబడదామని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అమరావతిలో 29 గ్రామాలే.. ఇక్కడ ఆరు వేల గ్రామాలు ఉన్నాయని అన్నారు. ఉతరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios