Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలనేదే జగన్ యత్నం : గుడివాడ అమర్‌నాథ్

తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఉత్తరాంధ్రను మోసం చేసిన పార్టీ టీడీపీయేనని.. ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడవటమే కాకుండా.. విశాఖ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
 

 minister gudivada amarnath slams tdp over uttarandhra development
Author
First Published Sep 15, 2022, 3:20 PM IST | Last Updated Sep 15, 2022, 3:20 PM IST

ఉత్తరాంధ్రను మోసం చేసిన పార్టీ టీడీపీయేనన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడవటమే కాకుండా.. విశాఖ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలనేది జగన్ ప్రయత్నమని అమర్‌నాథ్ అన్నారు.

అంతకుముందు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ బాగ్ ఒడంబడికలో చెప్పిన విధంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ లేదన్నారు. లంక, పోరంబోకు భూముల్ని తీసుకోవడం పట్టాలివ్వడం వంటి చర్యలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాజధాని అమరావతిలో రాబోతుందని .. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఎలా ముందే తెలుస్తుందని బుగ్గన ప్రశ్నించారు. 

ALso REad:అమరావతిలోని 30 వేల ఎకరాల్లో 10 వేలు వెయ్యి మంది చేతుల్లోనే.. చిట్టా విప్పమంటారా : అసెంబ్లీలో బుగ్గన

చంద్రబాబు నాయుడు కుటుంబం అమరావతిలో 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. దీనికి అనుగుణంగా బౌండరీలు మార్చింది వాస్తవం కాదా అని ఆర్ధిక మంత్రి నిలదీశారు. కేవలం కొంతమంది చేతుల్లో అమరావతి భూములు వున్నాయని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రకటన వెలువడకముందే శ్రీకాకుళం, అనంతపురం ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం నేతలకు ఇంత దూరం వచ్చి అమరావతిలో భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులిచ్చిన 30 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలు ఒక వెయ్యి మంది చేతుల్లోనే వుందని బుగ్గన ఆరోపించారు. 

రియల్ ఎస్టేట్ సిండికేట్ కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతారా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక భవనాల్లో వసతులు సరిగ్గా లేవని , కనీసం కిటికీలు కూడా లేవని ఆయన సెటైర్లు వేశారు. అమరావతిలో జరిగింది వ్యాపారామా లేక రాజధానా అని బుగ్గన ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్ కొడుకు విక్రమ్ సింహా కూడా భూములు కొన్నారని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. హెరిటేజ్ సంస్థ కూడా 14 ఎకరాల భూమి కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు. 

రాజధాని ప్రకటనకు ముందు ఎవరెవరు భూములు కొన్నారో అన్ని వివరాలు వున్నాయని బుగ్గన పేర్కొన్నారు. టీడీపీ నేతలు అమరావతిలో భూములు కొన్నది వాస్తవం కాదా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అంటే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అని బుగ్గన సెటైర్లు వేశారు. ఎస్సీల భూముల్ని బలవంతంగా లాక్కున్నారని.. విద్యుత్ బిల్లులే కాకుండా పాలు, గుడ్లు వంటి బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టారని ఆర్ధిక మంత్రి ఎద్దేవా చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios