ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ అతి త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగించనున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అతి త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగించనున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. సీఎం జగన్ విశాఖ వచ్చే సమయం నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసిందని అన్నారు. అనుకున్న సమయానికి కంటే విశాఖ నుంచి పాలన సాగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 

మంత్రి అమర్‌నాథ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ ఈ ఏడాది జనవరి 31వ తేదీ ఢిల్లీలో మాట్లాడుతూ.. రాబోయే నెలల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుందని చెప్పారు. మొన్న విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాబోయే రోజుల్లోనే అని అన్నారు. సీఎం జగన్ నెలలు నుంచి రోజుల్లోకి వచ్చారు. త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలన సాగబోతుంది. విశాఖపట్నంను రాజధాని చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. మీరు అనుకున్న సమయానికి.. అంతకన్నా ముందే సీఎం విశాఖకు వస్తారు. వచ్చే అకాడమిక్ ఇయర్‌లో జరుగుతుందని నేను గతంలో చెప్పాను.. దాని ప్రకారమే జరగబోతుంది’’ అని అన్నారు. 

విశాఖలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం జగన్ మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కానుందని తెలిపారు. రానున్న రోజుల్లో తాను కూడా విశాఖకు తరలిరానున్నట్టుగా తెలిపారు. విశాఖ నుంచే పరిపాలన జరగనుందని ప్రకటించారు.