తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో వుందన్నారు. నవంబర్ 25నే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందిందని మంత్రి చెప్పారు. విశాఖలో సదస్సు ఏర్పాటు చేస్తున్నందున దావోస్‌కు వెళ్లలేదని అమర్‌నాథ్ తెలిపారు. సృష్టికి తానే కారణమని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబంటూ ఆయన సెటైర్లు వేశారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్‌కు ఏపీకి ఆహ్వానం లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 19 వరకు ఐదేళ్లు దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు.