విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు అని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

విశాఖపట్నం : janasena పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు... రాజకీయ జీవితంలో కూడా విలువలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో రైతు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న సీఎం YS Jagan Mohan Reddyని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది మేం చెప్పడంకంటే ఆయన రెండో మాజీ భార్య రేణు దేశాయ్ ని అడిగితే తెలుస్తుంది. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు నిలకడ లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని, తర్వాత కారణం లేకుండానే వెళ్లిపోతుంటారు. ‘జగన్ పాలన జనరంజకంగా ఉంటే నేను రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటాను’ అని గత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఇప్పుడు జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రజలు చెబుతున్నందున ఆయన సినిమాలు చేసుకోవాలి. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కోసమే జనసేన పార్టీని ప్రారంభించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారు. జగన్ వైసీపీని స్థాపించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ సీబీఐతో కేసులు పెట్టించింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందనే విషయాన్ని టీడీపీ, జనసేన సహా ప్రతిపక్షాలన్నీ గుర్తుపెట్టుకోవాలి’ అని మంత్రి అమర్ నాథ్ అన్నారు.

ఇదిలా ఉండగా, నిన్న మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ పావు అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పవన్ కు కనపడదంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలని పవన్ రాజకీయ ప్రయాణం చేస్తున్నారని రాంబాబు ఆరోపించారు. ర్యాంబో రాంబాబు అని తనపై పవన్ సుటైర్ వేయలేదా? అని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కు స్క్రీన్ ప్లే మాత్రమే వచ్చని.. తమకు సినిమా తీయడం కూడా వచ్చంటూ రాంబాబు సెటైర్లు వేశారు. తమపై వ్యంగ్యంగా మాట్లాడిన పవన్.. తనమీద మాత్రం సెటైర్లు వేయొద్దంటున్నారంటూ ఫైర్ అయ్యారు. 

కాపు వర్గం ఓట్ల కోసం చంద్రబాబు పవన్ ను గాలంగా వేశారని రాంబాబు ఆరోపించారు. పవన్ కు తనకంటూ సొంత ఆలోచన లేదని అంబటి దుయ్యబట్టారు. ఏపీ మంత్రుల మీద సెటైర్లు వేసిన విషయం పవన్ కు గుర్తు లేదా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే లక్ష్యమని చెబుతున్నాడని రాంబాబు ఫైర్ అయ్యారు. నారా వారి దత్తపుత్రుడు అనే సినిమా తీయాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు. పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము పవన్‌కు వుందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.