వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ముందు తమ్ముడికి చెబితే బాగుంటుందని .. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు. ముందు తమ్ముడికి చెబితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.
ఆ పాత్ర రాంబాబుదేనని చెప్పే ధైర్యం కూడా లేదని మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా మంత్రి తీవ్రవ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును రౌడీషీటర్‌గా ప్రకటించాలని.. అసలు ఆ రోజు మా పార్టీ నేతలే లేరని ఆయన పేర్కొన్నారు. కావాలని రెచ్చగొట్టి.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని గుడివాడ అమర్‌నాథ్ దుయ్యబట్టారు.
ALso Read: సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకుంటున్నారా? చిరు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్
ఘటనాస్థలిలో ఎవరైనా చనిపోతే దాన్ని వివాదంగా మార్చాలని చూశారని ఆయన మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని గుడివాడ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వేసిన స్కెచ్‌లో ఇది భాగమేనని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇదంతా చేశారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఆయన భద్రత విషయంలో ఏదైనా జరిగితే తమ ప్రభుత్వంపై నింద వేస్తారని భయంగా వుందన్నారు. చంద్రబాబు ఎంత కాలం వుంటే మా పార్టీకి అంత మంచిదని అమర్‌నాథ్ పేర్కొన్నారు.
