Asianet News TeluguAsianet News Telugu

సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకుంటున్నారా? చిరు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్‌

Vijayawada: మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప‌లు థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో చిరు చేసిన వ్యాఖ్య‌లు ఏపీలో రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే స్పందించిన వైకాపా నాయ‌కుడు, మంత్రి బొత్స సత్యనారాయణ.. సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకుంటున్నారా? అంటూ కౌంట‌రిచ్చారు.  
 

AP Education Minister Botsa Satyanarayana responds to Chiranjeevi's comments RMA
Author
First Published Aug 8, 2023, 6:15 PM IST

AP Education Minister Botsa Satyanarayana: మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప‌లు థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో చిరు చేసిన వ్యాఖ్య‌లు ఏపీలో రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే స్పందించిన వైకాపా నాయ‌కుడు, మంత్రి బొత్స సత్యనారాయణ.. చిత్ర పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకుంటున్నారా? అంటూ కౌంట‌రిచ్చారు.

వివ‌రాల్లోకెళ్తే.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప‌లు థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో చిరు నటీనటుల రెమ్యూనరేషన్ విషయంపై స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఇదీకాస్త పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంది. ఈ క్ర‌మంలోనే వైకాపా నాయ‌కుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ స్పందిస్తూ..  సినీ ప‌రిశ్ర‌మ‌ను పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకుంటున్నారా? అంటూ కౌంట‌రించ్చారు. ఆయ‌న ఏ ఉద్దేశంతో అన్నారో తెలియ‌దు కానీ ప్ర‌భుత్వం త‌నప‌ని తాను చేసుకుంటోంద‌ని పేర్కొన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల‌ను తాను చూడ‌లేద‌నీ, చూసిన త‌ర్వాత మ‌రోసారి స్పందిస్తాన‌ని బొత్స పేర్కొన్నారు.

అలాగే, రాష్ట్రంలో వైకాపా పాల‌న గురించి మాట్లాడుతూ ఏపీలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయ‌ని తెలిపారు. అలాంట‌ప్పుడు చిరంజీవి ప్ర‌భుత్వాన్ని ప్ర‌స్తావిస్తూ ఎందుకు మాట్లాడారో ఆయ‌న చెప్పాల‌ని అన్నారు. ప్ర‌భుత్వం అన్ని స‌మ‌స్య‌ల‌పైనా స్పందిస్తుంద‌ని పేర్కొన్నారు. జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన యాత్ర‌ను గురించి ప్ర‌స్త‌విస్తూ.. తాము ప‌వ‌న్ చేప‌ట్టిన జ‌న‌సేన‌ వారాహి యాత్రను అడ్డుకోమ‌ని అన్నారు. మ‌న‌ది ప్ర‌జాస్వామ్య‌మ‌నీ, ఇక్క‌డ ఎవ‌రైనా యాత్ర‌లు, ర్యాలీలు చేసుకోవ‌చ్చు కానీ, వాటి పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని హెచ్చ‌రించారు. ప‌వ‌న్ యాత్ర గురించి దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతుంద‌ని వినిపిస్తోంద‌నీ, దీని కోసం టీడీపీ నాయ‌కుడు చంద్రబాబు పుంగనూరు యాత్ర మాదిరిగా విధ్వంసం చేయాలనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు.

కాగా, అంత‌కుముందు చిరంజీవి ఒక కార్య‌క్ర‌మంలో ప‌రోక్షంగా అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నటీనటుల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయని ప్రశ్నించారు. డిమాండ్, ఆదరణ ఉన్నప్పుడు నటీనటులకు రెమ్యూనరేషన్లు ఎక్కువే ఉంటాయనీ, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారంటూ పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ గురించి కాదు.. ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి మాట్లాడాలని అన్నారు. అలాగే, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించాలనీ, ఆ విధంగా ప్రయత్నాలు సాగాలంటూ చిరు వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios